Biker Escaping Death: హెల్మెంట్‌తో ఇట్లుంటది మరి.. మృత్యువు నుండి బైకర్‌ను కాపాడిన హెల్మెంట్..! షాకింగ్ వీడియో
మీరు వాహనంపై వెళ్తుంటే హెల్మెంట్ వాడుతున్నారా? ఇప్పటి వరకు వాడనివారు.. ఇప్పడినుంచైనా అలవాటు చేసుకోండి. హెల్మెంటే కాదా అని తీసిపారేయకండి.. హెల్మెంట్ కు మన ప్రాణాలను కాపాడే శక్తి ఉంటుంది. ఇందుకు ఉదాహరణగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. బస్సు చక్రాల కిందపడిన ఓ వ్యక్తి హెల్మెంట్ ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

Biker
Biker Escaping Death: మీరు వాహనంపై వెళ్తుంటే హెల్మెంట్ వాడుతున్నారా? ఇప్పటి వరకు వాడనివారు.. ఇప్పడినుంచైనా అలవాటు చేసుకోండి. హెల్మెంటే కాదా అని తీసిపారేయకండి.. హెల్మెంట్ కు మన ప్రాణాలను కాపాడే శక్తి ఉంటుంది. అయితే.. కేవలం ట్రాఫిక్ పోలీసులు విధించే చలాన్ల నుండి బయటపడేందుకు మొక్కుబడిగా హెల్మెంట్ వాడితే ఉపయోగం లేదు. ISI మార్క్ కలిగిన, నాణ్యమైన హెల్మెంట్ ను వాడాల్సిందే. కొంచెం డబ్బువెచ్చించాల్సి వచ్చినా పర్వాలేదు. ఎందుకంటే.. మీ ప్రాణాలను కాపాడే శక్తి హెల్మెంట్ కు ఉంటుంది. ఇదేంటి.. మరీమరీ ‘హెల్మెంట్ కు మీ ప్రాణాలను కాపాడే శక్తి ఉంటుంది’ అంటున్నాడని అనుకుంటున్నారా.. ఇక్కడ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడ కనిపించే వీడియోలో దాదాపు మృత్యువు నోట్లోకి వెళ్లిన వ్యక్తిని.. హెల్మెంట్ అమాంతం లాగి బయటపడేసినట్లుగా ఉంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుండటంతో పాటు.. హెల్మెంట్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.
Viral Video : కొబ్బరి కాయ ఎంత పనిచేసింది.. బైక్‌పై వెళ్లే మహిళ తలపై పడింది.. అంతే.. షాకింగ్ వీడియో!
ఈ వీడియోను బెంగుళూరు జాయింట్ కమీషనర్ ఆఫ్ ట్రాఫిక్ పోలీస్ డాక్టర్ BR రవికాంతేగౌడ తన ట్విటర్ లో పోస్టు చేశాడు. ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు “మంచి నాణ్యత కలిగిన, ISI మార్క్ ఉన్న హెల్మెట్” మాత్రమే ఉపయోగించాలని ఆయన కోరారు. అయితే రవికాంతే గౌడ పోస్టుచేసిన వీడియోలో ఓ కొండపై మూల మలుపు వద్ద బైక్ పై వస్తున్న వ్యక్తి బస్సు చక్రం కింద పడిపోయాడు. బస్సు డ్రైవర్ బ్రేక్ వేసినప్పటికీ బస్సు వెనుకాల టైర్ దాదాపు హెల్మెంట్ పైకి ఎక్కింది. కానీ హెల్మెంట్ నాణ్యతగా ఉండటంతో బైకర్ మృత్యువు నుంచి తప్పించుకుంటున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఈ ఘటన సోమవారం రియో డిజెనీరోలోని బెల్ ఫోర్డ్ రోక్సోలో జరిగింది. బస్సు చక్రాల కింద పడి ప్రాణాలతో బయటపడిన వ్యక్తిని 19ఏళ్ల అలెక్స్ సిల్వా పెరెస్‌గా గుర్తించారు. అలెక్స్ బస్సు చక్రాల కింద పడిన వెంటనే యువకుడికి సహాయం చేయడానికి ప్రజలు గుమిగూడారు, హెల్మెంట్ సాయంతో ప్రాణాలతో బయటపడటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
ಉತ್ತಮ ಗುಣಮಟ್ಟದ ಐ ಎಸ್ ಐ ಮಾರ್ಕ್ ಹೆಲ್ಮೆಟ್" ಜೀವರಕ್ಷಕ"
Good quality ISI MARK helmet saves life. pic.twitter.com/IUMyH7wE8u
— Dr.B.R. Ravikanthe Gowda IPS (@jointcptraffic) July 20, 2022
ఈ వీడియోను.. బెంగళూరు పోలీసులు, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమతమ ట్విటర్ ఖాతాల్లో పోస్టు చేశారు. హెల్మెట్‌ల ప్రాముఖ్యతపై సందేశాన్ని పంచుకున్నారు. ఇదిలాఉంటే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Mr గౌడ పోస్ట్ చేసిన వీడియోను వేలాది మంది నెటిజన్లు వీక్షించారు, అనేక లైక్‌లు, కామెంట్‌లు చేస్తున్నారు. “వావ్.. చాలా భయానకంగా ఉంది, అయితే మంచి హెల్మెట్ మీ ప్రాణాలను కాపాడుతుంది” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. “వీడియో భయానకంగా ఉంది, ఇది భారతదేశంలోని వీడియో కాదని బాగా అర్థమైంది అంటూ మరో వ్యక్తి తన కామెంట్ లో పేర్కొన్నాడు.