Hema Malini : సాధారణ వ్యక్తిలా ఒకప్పటి స్టార్ హీరోయిన్ మెట్రో, ఆటో రిక్షా ప్రయాణం..

బాలీవుడ్ లో అగ్ర కథానాయికగా ఒక వెలుగు వెలిగిన హేమ మాలిని.. తాజాగా తన ఇంటికి చేరుకోడానికి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ ఉపయోగించుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది.

Hema Malini : సాధారణ వ్యక్తిలా ఒకప్పటి స్టార్ హీరోయిన్ మెట్రో, ఆటో రిక్షా ప్రయాణం..

Hema Malini uses mumbai metro and auto rickshaw to reach her home

Updated On : April 12, 2023 / 1:58 PM IST

Hema Malini : ఒకప్పటి స్టార్ హీరోయిన్ హేమ మాలిని.. బాలీవుడ్ లో అగ్ర కథానాయికగా ఫేమ్ ని ఎంజాయ్ చేసింది. నటి గానే కాదు డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా సినీ రంగానికి సేవలు అందించిన హేమ మాలిని.. రాజకీయ నాయకురాలిగా కూడా ప్రజాసేవ చేసింది. ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో ముఖ్య పాత్రల్లో కనిపిస్తూ వస్తుంది. కాగా ఈ స్టార్ హీరోయిన్ ఒక సాధారణ వ్యక్తిలా మెట్రో మరియు ఆటో రిక్షా ప్రయాణం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక ఈ అనుభవాన్ని తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

Stranger Things : టీనేజ్‌లో హాలీవుడ్ యాక్ట్రెస్ ఎంగేజ్మెంట్.. జస్ట్ 19 అంటున్న నెటిజెన్లు..

ముంబైలోని ట్రాఫిక్ వలన ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోడానికి దాదాపు గంటల సమయం పడుతుంది. ఈ క్రమంలోనే హేమ మాలిని కూడా ట్రాఫీస్ లో ఇబ్బంది పడడంతో.. ముంబై మెట్రోని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో దహిసర్ నుంచి జుహులోని తన ఇంటి వరకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణించింది. మెట్రోలో DN నగర్ వరకు ప్రయాణించిన హేమ మాలిని అక్కడ నుంచి జుహులోని తన ఇంటికి ఆటోలో చేరుకుంది. ఈ విషయాన్ని అంతా ఆమె వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన అనుభవాన్ని తెలియపరించింది.

నా కారులో దహిసర్ చేరుకోవడానికి 2 గంటలు సమయం పట్టింది. ఆ ప్రయాణతో చాలా అలసిపోయాను. దీంతో తిరిగి ప్రయాణం కోసం పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఉపయోగించుకున్నాను. ముంబై మెట్రో ద్వారా దహిసర్ నుంచి DN నగర్ వరకు చేరుకున్నాను. ఆ తరువాత DN నగర్ నుంచి జుహూకి ఆటోలో ప్రయాణించి ఇంటికి చేరుకున్నాను. కేవలం అరగంటలోనే నేను ఇంటికి చేరుకున్నాను. ఈ ప్రయాణం చాలా సులభంగానే ఉండడం కాదు అద్భుతం కూడా ఉంది అంటూ చెప్పుకొచ్చింది. ఇక పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో హేమ మాలినిని చూసిన అభిమానులు ఆమెతో ఫోటోలు దిగేందుకు ఎగపడ్డారు. ఆమె కూడా ప్రతి ఒకరికి ఫోటో ఇస్తూ ఇంటికి చేరుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి.