Kartikeya: హిట్టు ఫట్టు కాదు.. డిఫరెంట్ క్యారెక్టర్స్ పట్టేస్తున్న హీరో!

రిజల్ట్ తో సంబంధం లేకుండా వరసగా సినిమాలు చేస్తున్న హీరో కార్తికేయ. సినిమా సినిమాకి డిఫరెంట్ క్యారెక్టర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈమధ్యే వలిమై సినిమాలో విలన్ గానూ..

Kartikeya: హిట్టు ఫట్టు కాదు.. డిఫరెంట్ క్యారెక్టర్స్ పట్టేస్తున్న హీరో!

Kartikeya

Kartikeya: రిజల్ట్ తో సంబంధం లేకుండా వరసగా సినిమాలు చేస్తున్న హీరో కార్తికేయ. సినిమా సినిమాకి డిఫరెంట్ క్యారెక్టర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈమధ్యే వలిమై సినిమాలో విలన్ గానూ మెప్పించాడు. మినిమం బడ్జెట్ ప్రొడ్యూసర్స్ మాత్రమే కాదు.. రీసెంట్ గా ఈ యంగ్ హీరోకి.. యువీ క్రియేషన్స్ బ్యానర్ భారీ ఆఫర్ ఇచ్చింది. ఆ వివరాల పై ఓ లుక్కేద్దాం.

Kartikeya8: క్రేజీ బ్యానర్ లో కార్తికేయ సినిమా.. ఈసారైనా హిట్టు అందుకుంటాడా?

టాలీవుడ్ లో బిగ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న యంగ్ హీరోల్లో కార్తికేయ ఒకరు. ఆయనకు లేటెస్ట్ గా భారీ సినిమాల నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ క్రేజీ ఆఫరిచ్చింది. ప్రశాంత్ రెడ్డి అనే డైరెక్టర్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ, కార్తికేయను ఓ డిఫరెంట్ రోల్ లో ప్రజెంట్ చేస్తూ, భారీ యాక్షన్ సినిమా ప్లాన్ చేసింది యువీ క్రియేషన్స్.

Kartikeya Wedding : ‘పెద్దయ్యాక హీరో అవుతా.. అప్పుడు నా పెళ్లికి చిరంజీవి వస్తాడు’

ఫస్ట్ సినిమాతోనే సక్సెస్ అందుకున్న కార్తికేయ సినిమా సినిమాకి క్యారెక్టర్ లో వేరియేషన్ చూపిస్తూ, రిజల్ట్ ఏదైనా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు యువీ క్రియేషన్స్ సినిమాలో బెట్టింగులు కాసే కుర్రాడిగా కనిపించబోతున్నాడు. ఆ మధ్య గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ టచ్ ఉన్న క్యారెక్టర్ చేసిన కార్తికేయ, కోలీవుడ్ స్టార్ అజిత్ కి విలన్ గా నటించి మెప్పించాడు. 100 కోట్ల క్లబ్ లో చేరిన వలిమై సినిమాతో కార్తికేయ కోలీవుడ్ లోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు.

Pawan-Kartikeya: పవన్ సార్‌కి మద్దతు ఇవ్వడం నా బాధ్యత.. హీరో కార్తికేయ

ఈ సినిమాలో కార్తికేయకు, జోడీగా ఐశ్వర్య మీనన్ కనిపించబోతుంది. పొలిటికల్ టచ్ ఉన్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రానున్నట్టు తెలుస్తోంది. గుణ, 90 ఎంఎల్, చావుకబురు చల్లగా, రాజావిక్రమార్క లాంటి సినిమాలు చేసిన కార్తికేయ ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయాడు. సాహో, రాధేశ్యామ్ లాంటి సినిమాలను నిర్మించిన యువీ క్రియేషన్స్ సంస్థ ఇప్పుడీ హీరోతో భారీ సినిమా చేస్తుంది. ఈ సినిమాతో అయినా ఈ యంగ్ హీరో ఆశించిన సక్సెస్ వస్తుందేమో చూడాలి.