Hero Ram : బోయపాటి కోసం ఏకంగా 80 కేజీల కేక్ తెప్పించిన రామ్..

తాజాగా దర్శకుడు బోయపాటి శ్రీను పుట్టిన రోజు కావడంతో రామ్ - బోయపాటి సినిమా సెట్ లో బోయపాటి శ్రీను పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా చేశారు. ఈ సెలబ్రేషన్స్ కి హీరో రామ్ ప్రత్యేకంగా బోయపాటి కోసం ఏకంగా 80 కేజీల కేక్ ని తెప్పించాడు.

Hero Ram : బోయపాటి కోసం ఏకంగా 80 కేజీల కేక్ తెప్పించిన రామ్..

Hero Ram arranged Special 80KG cake for Boyapati Srinu Birthday Celebrations

Updated On : April 27, 2023 / 7:27 AM IST

Hero Ram :  ఎనర్జిటిక్ హీరో రామ్(Ram) పోతినేని ప్రస్తుతం బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వంలో ఫుల్ మాస్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో శ్రీలీల(Sreeleela), సయీ మంజ్రేకర్(Saiee Manjrekar) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దసరా(Dasara) కానుకగా రామ్ – బోయపాటి సినిమా అక్టోబర్ 20న రిలీజ్ చేస్తారని ఇప్పటికే ప్రకటించారు చిత్రయూనిట్. రామ్ గత సినిమా ది వారియర్(The Warrior) పరాజయం పాలవ్వడంతో ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నాడు.

తాజాగా దర్శకుడు బోయపాటి శ్రీను పుట్టిన రోజు కావడంతో రామ్ – బోయపాటి సినిమా సెట్ లో బోయపాటి శ్రీను పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా చేశారు. ఈ సెలబ్రేషన్స్ కి హీరో రామ్ ప్రత్యేకంగా బోయపాటి కోసం ఏకంగా 80 కేజీల కేక్ ని తెప్పించాడు. బోయపాటితో కేక్ కట్ చేయించి షూటింగ్ సెట్ లోనే సెలబ్రేషన్స్ చేశారు. ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ లో చిత్రయూనిట్ అంతా పాల్గొంది.

Hero Ram arranged Special 80KG cake for Boyapati Srinu Birthday Celebrations

Sara Alikhan : ముంబై మెట్రోలో సారా అలీఖాన్..

రామ్ ఏకంగా బోయపాటి కోసం 80 కేజీల కేక్ తెప్పించడంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. రామ్ ఈ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నాడట. ఇక బోయపాటి ఇటీవల అఖండ తో ఫుల్ సక్సెస్ మోడ్ లో ఉన్నాడు. దీంతో బోయపాటి నుంచి రామ్ మంచి హిట్ సినిమా ఆశిస్తున్నాడు. ఇప్పటికే జరిగిన షూట్ తో సినిమా మాసివ్ హిట్ అవుతుందని రామ్ నమ్ముతున్నాడు. దీంతో బోయపాటి మీద ప్రేమతో రామ్ ఇలా పెద్ద కేక్ ని తెప్పించి బర్త్ డే సెలబ్రేషన్స్ చేశాడు. మరో రామ్ బోయపాటి సినిమా ఏ రేంజ్ లో మాస్ ప్రేక్షకులని మెప్పిస్తుందో చూడాలి.