Dharma Sansad : హరిద్వార్ ఈవెంట్ లో విద్వేష ప్రసంగంపై రాహుల్,ప్రియాంక ఫైర్

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ లోని వేద్ నికేతన్ ధామ్ లో యతి నరసింహానంద్ గిరి నేతృత్వంలో జునా అఖాడా డిసెంబర్ 17-20 మధ్యలో మూడు రోజుల పాటు నిర్వహించిన

Dharma Sansad : హరిద్వార్ ఈవెంట్ లో విద్వేష ప్రసంగంపై రాహుల్,ప్రియాంక ఫైర్

Congress

Dharma Sansad : ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ లోని వేద్ నికేతన్ ధామ్ లో యతి నరసింహానంద్ గిరి నేతృత్వంలో జునా అఖాడా డిసెంబర్ 17-20 మధ్యలో మూడు రోజుల పాటు నిర్వహించిన “ధర్మ సంసద్” లో విద్వేష ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు.

హిందుత్వవాదులే ఇలాంటి విద్వేష ప్రసంగాలు చేసి సమాజంలోని వర్గాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తారని, దాని వల్ల అందరూ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రాహుల్ శుక్రవారం ఓ ట్వీట్ లో తెలిపారు. భారత్..​ హిందుత్వవాదానికి, హింసకు వ్యతిరేకమని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను చేసే వారిని ఉపేక్షించవద్దన్నారు.

మరోవైపు, విద్వేషం, హింసను వ్యాప్తి చేయాలని చూసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ డిమాండ్​ చేశారు. మాజీ ప్రధాని సహా ఇతర వర్గాల వారిపై దాడి చేయాలని ప్రచారం చేసే వారిని వదిలిపెట్టొద్దని శుక్రవారం ప్రియాంక ఓ ట్వీట్ లో తెలిపారు.

కాగా, హరిద్వార్​ ఈవెంట్ లో పలువురు విద్వేష ప్రసంగాలు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ కొన్ని వర్గాల వారిపై దాడులు చేయాలని రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. ఓ వర్గంవారిపై దాడి చేయాలని, ఆయుధాలతో అందుకు సిద్ధం కావాలని, మాజీ ప్రధానిని చంపాలని పలువురు ప్రసంగించినట్లు ఆ వీడియోలలో కనిపిస్తోంది.

ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ విద్వేష ప్రసంగం తీవ్రంగా ఉందని హరిద్వార్​ జ్వాలాపుర్ ప్రాంతానికి చెందిన గోఖలే చేసిన ఫిర్యాదు మేరకు.. జితేంద్ర నారాయణ్​ త్యాగిపై కేసు నమోదైంది. ధర్మ సంసద్​లో ప్రసంగించిన వారిలో జితేంద్ర నారాయణ్​ త్యాగి కూడా ఉన్నారు. కాగా, జితేంద్ర త్యాగి ఇటీవలే తన మతం మార్చుకున్నారు. వసీం రిజ్వీ పేరు తీసి త్యాగిగా మారారు. ఐపీసీ సెక్షన్​ 153ఏ కింద జితేంద్రపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసినట్లు కోత్వాలి పోలీస్ స్టేషన్​ ఎస్​హెచ్​ఓ రకీందర్ సింగ్ తెలిపారు. సమాజంలో వర్గాలు, కులాలు, భాష, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా ప్రవర్తిస్తే ఈ సెక్షన్​ కింద అభియోగాలు మోపుతామన్నారు.

ALSO READ UP Election : యోగి మఠానికి,మోదీ పర్వతాల్లోకి..పోలీసులకు ఓవైసీ హెచ్చరికపై దుమారం