Pregnant..Snake : గర్భిణులను చూసిన తరువాత పాములకు కళ్లు కనిపించవా..?అందుకే కాటువేయవా..? ఆశ్చర్యం కలిగించే ఆసక్తికర కారణాలు..
గర్భంతో ఉన్న మహిళలను చూస్తే పాములకు కళ్లు కనిపించవా..? గర్భిణులను చూస్తే పాములు గ్రుడ్డిగా మారిపోతాయా..? దీంట్లో నిజమెంత...? పాములకు..గర్భిణులకు ఉన్న సంబంధమేంటి...దీని వెనుక ఉన్న ఈ కారణాలేంటి..?

pregnant women and snake bite
pregnant women and snake : పాములు గర్భిణులను కాటు వేయవట. గర్భిణీ స్త్రీలను చూసిన తర్వాత పాములకు కళ్లు కూడా కనిపించవట..మరి పాములకు ఏ మహిళ గర్భంతో ఉందో ఎలా తెలుస్తుంది..?అసలు దీంట్లో నిజమెంత..? నిజంగా గర్భిణులను పాములు కాటు వేయవా..? ఎందుకవల్ల..ఇది కేవలం మూఢనమ్మకమేనా..?నిజమా..? అసలు పాములు గర్భిణులు ఉన్న వైపుకు కూడా రావట..ఇవన్నీ చాలా చాలా ఆసక్తికలిగించే విషయాలు.
ఈ విషయాలు తెలుసుకునే ముందు ఓ పురాణం గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. అదే ‘బ్రహ్మ వైవర్త పురాణం’. హిందు ధర్మంలోఎన్నో పురాణాలున్నాయి. విష్ణు పురాణం, శివపురాణం,మార్కండేయ పురణం. మత్స్య పురాణం, స్కంద పురాణం,గరుడ పురాణం వంటివి ఎన్నో ఉన్నాయి. పురాణాలు ఉప పురాణాలు కూడా ఉన్నాయి. వాటిలో ‘బ్రహ్మ వైవర్త పురాణం’ కూడా ఒకటి. ఈ పురాణంలో 18,000 శ్లోకాలుంటాయి. ఈ పురాణం ప్రధానంగా రాధా కృష్ణుల చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది.
ఈ ‘బ్రహ్మ వైవర్త పురాణం’ వివరాల గురించి పక్కన పెడితే ‘బ్రహ్మ వైవర్త పురాణం’ ప్రకారం గర్భంతో ఉన్న స్త్రీలను పాములు కాటు వేయవట..దీనికి కారణం ఓ గర్భిణి నాగ జాతికి ఇచ్చి శాపమేనని అంటారు. ఈ ‘బ్రహ్మ వైవర్త పురాణం’ గురించి గర్భిణులు పాములు ఎందుకు కాటువేయవో దాని వెనుక ఉన్న పురాణ కథ కంటే ముందు శాస్త్రీయంగా చెప్పాలంటే..ప్రకృతిపరంగా పాములకు కొన్ని ప్రత్యేక ఇంద్రియాలను గుర్తించే శక్తినిచ్చింది. ప్రకృతిలో ప్రతీ జీవికి ఓ ప్రత్యేక శక్తి ఉంటుంది. అలా పాములకు ప్రత్యేక ఇంద్రియాలను గుర్తించే శక్తి ఉంటుంది. దాని వల్ల పాములు మహిళలు గర్భవతిగా ఉన్నారో లేదో గుర్తించగలవట. గర్భం దాల్చిన తర్వాత స్త్రీల శరీరంలో కొన్ని ప్రత్యేక అంశాలు ఏర్పడతాయి. శరీరకంగా మానసికంగా పలు మార్పలు వస్తాయి. అలాంటి వాటిని పాములు సులభంగా గుర్తించగలవట. అందుకే గర్భిణీ స్త్రీని గుర్తించిన తర్వాత పాములు వారిని పొరపాటున కూడా కాటేయవట. ఇది వినడానికి కొంత వింతగా..ఆశ్చర్యంగా ఉన్నా నిజమేనంటారు. దీనికి గల కారణాలు..పూర్తి వివరాలను బ్రహ్మ వైవర్త పురాణంలో ఉన్నాయంటారు.
నాగ వంశానికి గర్భిణి శాపం..
బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం..ఒకప్పుడు గర్భిణీ స్త్రీ ఈశ్వరుని ఆలయంలో కూర్చుని శివుని గురించి తపస్సు చేసే సమయంలో రెండు పాములు గుడిలోకి వచ్చాయట. కానీ తపోదీక్షలో మునిగిపోయిన ఆ గర్భిణి వాటిని ఏమాత్రం గుర్తించలేదు. దీంతో ఆమెను ఇబ్బంది పెట్టాలనుకున్న ఆ పాములు మీద పాకుతు..బుసలు కొడుతు శబ్దాలు చేశాయట. కానీ ఆమె మాత్రం ఏమాత్రం చలించకుండా తపోదీక్షలోనే మునిగిపోయి శివయ్యను జపించటంలోనే మనస్సు లగ్నం చేసుకుంది.దీంతో ఆరెండు పాములు ఆమెను నానా విధాలుగా ఇబ్బందులకు గురి చేసి ఎట్టకేలకు తపస్సును భగ్నం చేశాయి. దీంతో ఆమె ఆ రెండు పాముల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.శిమయ్యకు ఆభరణాలుగా ఉండే మీరు శివయ్య కోసం తపస్సు చేసే నాకు ఇబ్బందులు కలుగజేశారు.ఎంత ధైర్యం అంటూ మండిపడింది.
తన తపస్సుకు భంగం కలిగించినందుకు..గర్భిణులో పెరుగుతున్న బిడ్డ ఇక నుంచి గర్భిణీ స్త్రీల దగ్గరకు వెళ్లే పాము అంధుడిగా మార్చేస్తుంది అని మొత్తం నాగవంశానికి శాపం విధించిందట. అప్పటినుంచి గర్భిణీ స్త్రీలను చూసిన తర్వాత పాములు అంధులుగా మారిపోతాయట. అలా ఆ కథ ప్రకారం పాములు గర్భిణులు కాటేయవు అనే విషయం కూడా ప్రచారంలోకి వచ్చింది. కాగా.. మహిళలు దివ్య స్త్రీ మూర్తి రూపాలేనని, విశ్వానికి సహ సృష్టికర్త అనీ, స్త్రీకి జరిగే అవమానం దేవత రాధకు జరిగినట్లేననీ ఈ పురాణం వచిస్తుంది.అలా గర్భిణికి జరిగిన ఈ ఘటన పాములు గర్భిణులను కాటువేయపోవటాని కారణమని అంటారు.
గర్భిణీ మహిళలకు పాములు కాటు వేయకపోవడానికి పురాణ కథల సారాంశమే కాదు..శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని కొంతమంది అభిప్రాయపడుతుంటారు. మహిళలు గర్భం దాల్చిన తర్వాత శరీరంలో కొన్ని మూలకాలు ఏర్పడి అనేక మార్పులు చోటు చేసుకుంటాయని..వాటిలో ముఖ్యమైన అంశం హార్మోన్ల స్రావం. బహుశా పాములకు ఈ హార్మోన్ మహిళ శరీరంలో మార్పు వచ్చిందని..తన దగ్గరికి రాకుండానే దారిని మార్చుకుని వేరొక దిశకు వెళ్లిపోతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయాలు వ్యక్తంచేస్తుంటారు. కానీ దీని గురించి నిరూపించబడిన దాఖలు లేవు.అంటే ఇవి కేవలం ఊహాగానాలుగా చూడాలి.
కాగా పాములు..గర్భిణుల విషయంలో చాలా నమ్మకాలున్నాయి. భార్య గర్భంతో ఉంటే ఆమె భర్త పాములను చంపకూడదని అంటారు. అలా చంపితే పుట్టే బిడ్డకు నాగదోషం అంటుకుటుందని అంటారు. ఏది ఏమైనా గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండటం చాలాచాలా అవసరం. ఈ లోకంలో ఎన్నో నమ్మకాలు..మరోన్నో సంప్రదాయాలు. ఎవరికి నష్టం చేకూరనంత వరకు నమ్మకాలు తప్పుకాదు. కానీ నమ్మకం మూఢత్వం కాకూడదు. ఆ మూఢత్వం ప్రాణాలకు హాని చేయకూడదు. ఏది ఏమైనా గర్భిణులు పాములే కాదు విషయపు జీవాల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇప్పటి వరకు గర్భిణులను పాములు కాటు వేయవని చెప్పటానికి వీల్లేదు. జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిన అసవరం ఉంది.