Hardik Pandya: క్రికెట్ లేకపోతే బంక్‌లో పెట్రోల్ కొడుతూ పని చేస్తా.. – పాండ్యా

టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అగ్గిపెట్టె లాంటి ఇంటి నుంచి ముంబైలోని లగ్జరీ అపార్ట్‌మెంట్ వరకూ ఎదిగాడు.

Hardik Pandya: క్రికెట్ లేకపోతే బంక్‌లో పెట్రోల్ కొడుతూ పని చేస్తా.. – పాండ్యా

Hardik Pandya

Hardik Pandya: టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అగ్గిపెట్టె లాంటి ఇంటి నుంచి ముంబైలోని లగ్జరీ అపార్ట్‌మెంట్ వరకూ ఎదిగాడు. అతని స్కిల్స్, టాలెంట్ తో టీమిండియాకే కాదు ఐపీఎల్ ముంబై ఇండియన్స్ లోనూ సత్తా చాటాడు. కొద్ది సంవత్సరాలుగా పర్‌ఫెక్ట్ ఫినిషర్ రోల్ సంపాదించిన పాండ్యా.. చిన్న నాటి కష్టాలను ఓర్చుకుంటూనే పెరిగాడు.

ఐపీఎల్ వేలంలో భారీ అమౌంట్ పలికిన తర్వాత ప్లేయర్ల జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయని అడిగిన ప్రశ్నకు ఇలా బదులిచ్చాడు. ఐపీఎల్ లో వచ్చే డబ్బు ప్లేయర్ల వ్యక్తిత్వం చెడగొడుతుందంటారా..

కచ్చితంగా చెప్పగలను.. నేను హార్దిక్ పాండ్యా ఎప్పుడూ అహంభావంతో ఫీల్ అవ్వం. మాకు ఎలా ఉండాలో క్లారిటీ ఉంది. డబ్బు అనేది మంచిదే. కానీ, అది చాలా మార్చేస్తుంది. దానికి నేనే ఉదాహరణ. లేదంటే నేనేదో పెట్రోల్ బంక్ లో పనిచేసేవాణ్ని. ఇది జోక్ కాదు. నా ఫ్యామిలీనే నాకు ప్రాధాన్యత. కచ్చితంగా వారికి మంచి జీవితం ఇవ్వాలనే అనుకుంటాను అని పాండ్యా చెప్పుకొచ్చాడు.

……………………………………….: ఎంపీ కేశినేని ఆఫీస్‌లో చంద్రబాబు ఫొటోల తొలగింపు!

2019లో ఒకరితో మాట్లాడా.. అతను యువ క్రికెటర్ల దగ్గర డబ్బులు ఉండవని అన్నాడు. దానికి నేనొప్పుకోలేదు. గ్రామీణ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తికి పెద్ద కాంట్రాక్ట్ దొరికితే.. అది అతని కోసమే ఉంచుకోడు. ముందు పేరెంట్స్, తర్వాత బంధువులకు ఖర్చుపెట్టాలనుకుంటాడు. డబ్బు చాలా తేడా చూపిస్తుంది. తారతమ్యాలను కూడా పుట్టిస్తుందని అంటారు. ఇది నేను నమ్మను. డబ్బు మీద స్పోర్ట్ మీద అంత ప్యాషనేట్ గా ఉంటాను. డబ్బులు అనేవి లేకపోతే ఎంతమంది క్రికెట్ ఆడతారో నాకు కూడా తెలియదు’ అని చెప్పాడు.