Allu Arjun : పుష్ప సినిమాలో యాక్షన్ సీన్స్.. తగ్గేదే లే అంటున్న నిర్మాతలు, ఎపిసోడ్ కోసం రూ. 40 కోట్లు ఖర్చు!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న్యూ ఫిల్మ్ ‘పుష్ప’ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.

Allu Arjun : పుష్ప సినిమాలో యాక్షన్ సీన్స్.. తగ్గేదే లే అంటున్న నిర్మాతలు, ఎపిసోడ్ కోసం రూ. 40 కోట్లు ఖర్చు!

Bunny

Pushpa Movie : టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న్యూ ఫిల్మ్ ‘పుష్ప’ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన టీజర్ అభిమానులను తెగ ఆకట్టుకొంటోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. అయితే..ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరెకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీగా ఖర్చు పెడుతున్నట్లు టాక్.

ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ కోసం ఏకంగా రూ. 40 కోట్లు ఖర్చు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉండడం, పాన్ ఇండియా స్థాయి సినిమా కావడంతో నిర్మాతలు ఎక్కడా తగ్గడం లేదని సమాచారం. ఈ సినిమా కోసం దాదాపు రూ. 200 కోట్లు ఖర్చు చేయడానికి రెడీ ఉన్నారంట. మొత్తం బడ్జెట్ లో అధిక భాగం యాక్షన్ సీన్స్ కే కేటాయించారని, ప్రేక్షకుల అంచనాలకు మించి యాక్షన్ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. విలన్ గా మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న పుష్ప సినిమాలో జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సునీల్, ధనుంజయ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

Read More : హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి..ప్రధానికి కపిల్ సిబల్ విజ్ణప్తి