Fire Accident: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. లజ్ పత్ నగర్ లోని సెంట్రల్ మార్కెట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల ఉన్న వస్త్ర దుకాణాలకు మంటలు అంటుకున్నాయి.

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

Fire Accident

Updated On : June 12, 2021 / 12:36 PM IST

Fire Accident: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లజ్ పత్ నగర్ లోని సెంట్రల్ మార్కెట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల ఉన్న వస్త్ర దుకాణాలకు మంటలు అంటుకున్నాయి. ప్రస్తుతం మంటలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. క్షణాల్లో చుట్టుపక్కల దుకాణాలకు మంటలు వ్యాపించడంతో ప్రజలు పరుగులు తీశారు.

సమాచారం అందడంతో ఫైర్ సిబ్బంది ఘటన స్థలికి చేరుకున్నారు. మొత్తం 16 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆస్తినష్టం భారీగా ఉంటుందని తెలుస్తుంది. ఆ ప్రాంతంలో మొత్తం వస్త్ర దుకాణాలు ఉండడంతో మంటలు వ్యాప్తి అధికంగా ఉందని అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. కాగా అగ్నిప్రమాదానికి కారణం తెలియరాలేదు