Huzurabad : బహిరంగసభలకు సీఎం కేసీఆర్ సిద్ధం..ముహూర్తాలు ఖరారు

సీఎం కేసీఆర్ రెండు బహిరంగ సభలకు సిద్ధమవుతున్నారు. ఈ సభలకు సంబంధించి ముహూర్తాలు కూడా ఖరారు అయ్యాయి. దళితబంధు పథకం ప్రారంభ సభ, హుజురాబాద్ ఎన్నికల సభ నిర్వహించబోతున్నారు. వీటికి సంబంధించి ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు.

Huzurabad : బహిరంగసభలకు సీఎం కేసీఆర్ సిద్ధం..ముహూర్తాలు ఖరారు

Kcr

TRS Public Meeting : సీఎం కేసీఆర్ రెండు బహిరంగ సభలకు సిద్ధమవుతున్నారు. ఈ సభలకు సంబంధించి ముహూర్తాలు కూడా ఖరారు అయ్యాయి. దళితబంధు పథకం ప్రారంభ సభ, హుజురాబాద్ ఎన్నికల సభ నిర్వహించబోతున్నారు. వీటికి సంబంధించి ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ పథకాలపై దృష్టి సారించారు. తాజాగా ప్రభుత్వం తీసుకొస్తున్న తెలంగాణ దళితబంధు పథకాన్ని విజయవంతం చేయడానికి చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం 80 వేల నుంచి లక్ష కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Read More : Rashmika Mandanna: తమిళ వ్యక్తినే పెళ్లాడతానంటోన్న రష్మిక

దళితుల్లో ప్రగతి వెలుగులు నింపాలని, ఆ కాలనీల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు దళితబంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 2వ వారంలో ప్రారంభించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇందుకోసం గ్రామం లేదా పట్టణాన్ని ఎంపిక చేసి ఆ ప్రాంతంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్. గతంలో రైతు బంధు పథకాన్ని కూడా ఇదే నియోజకవర్గం శాలపల్లిలో మొదలుపెట్టారు.

Read More : Sirmaur Landslide : ఒళ్లు గగుర్పొడిచే బీభత్సం..క్షణాల్లో లోయలోకి జారిపోయిన జాతీయ రహదారి

ఈటల రాజేందర్ బర్తరఫ్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా తర్వాత…సీఎం కేసీఆర్ హుజురాబాద్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు. రానున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు కోసం పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని సీఎం కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌తో పాటు హరీష్ రావును ఆదేశించారు. ఉప ఎన్నికలో విజయం దిశగా నడిపించేందుకు అవసరమైన విధంగా కసరత్తు ముమ్మరం చేశారు. ఇందుకు అనుగుణంగా సెప్టెంబర్ నెలలో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు.