Huzurabad By Poll : 13వ రౌండ్‌‌లో ఈటల ముందంజ…ఏ రౌండ్‌‌లో ఎన్ని ఓట్లు

రౌండ్ రౌండ్ మధ్య వస్తున్న ఫలితాలు ఉత్కంఠను రేకేత్తిస్తున్నాయి. తాజాగా..13వ రౌండ్ ముగిసింది. ఇందులో కూడా బీజేపీ అభ్యర్థి ఈటల ఆధిక్యంలో కొనసాగారు.

Huzurabad By Poll : 13వ రౌండ్‌‌లో ఈటల ముందంజ…ఏ రౌండ్‌‌లో ఎన్ని ఓట్లు

Hzb By Poll 2021

Huzurabad Bypoll Etela Rajender : హుజూరాబాద్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మొదటి రౌండ్ నుంచి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం కనబరుస్తూ వస్తున్నారు. అయితే..స్వల్ప ఆధిక్యం ఉండడంతో రానున్న రౌండ్లలో తాము ఆధిక్యం కనబరుస్తామని ఆశాభావంతో ఉన్నారు టీఆర్ఎస్ శ్రేణులు. 8వ రౌండ్ లో కాస్త వెనుకబడ్డ ఈటల తొమ్మిదో రౌండ్ వచ్చేసరికి పుంజుకున్నారు. ఇదే దూకుడు కొనసాగితే.. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. మొత్తం 22 రౌండ్స్ లో ఓట్లను లెక్కించనున్నారు అధికారులు.

Read More : Huzurabad By Poll : విజయం ముందే ఊహించాం – బండి సంజయ్

హుజూరాబాద్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరపున గెల్లు శ్రీనివాస్, బీజేపీ తరపున ఈటల రాజేందర్, కాంగ్రెస్ తరపున బల్మూరి వెంకట్ లు పోటీ పడ్డారు. అక్టోబర్ 30వ తేదీన ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. 2021, నవంబర్ 02వ తేదీ మంగళవారం కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. అందరూ ఊహించినట్టే…టీఆర్ఎస్, బీజేపీ పార్టీ మధ్య హోరాహోరీ కొనసాగింది. తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కించారు. ఇందులో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ అధిక్యం కనబర్చారు. అనంతరం ఈవీఎంలోని ఓట్లను లెక్కించారు. రౌండ్ రౌండ్ మధ్య వస్తున్న ఫలితాలు ఉత్కంఠను రేకేత్తిస్తున్నాయి. తాజాగా..13వ రౌండ్ ముగిసింది. ఇందులో కూడా బీజేపీ అభ్యర్థి ఈటల ఆధిక్యంలో కొనసాగారు. 8 వేల 388 ఓట్ల ఆధిక్యంలో కొనసాగారు. ఈ రౌండ్ లో ఈటల 1865 ఓట్ల ఆధిక్యం కనబర్చారు.అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా వుండటం… పోలింగ్ శాతం కూడా భారీగా నమోదవడంతో గతంలో కంటే కాస్త ఆలస్యంగానే ఫలితం వెలువడనుంది.

Read More : Huzurabad By Poll : హుజూరాబాద్ మండలంలో ఈటలకు ఆధిక్యం

రౌండ్ 1 : టీఆర్ఎస్ (4,444), బీజేపీ (4,610), కాంగ్రెస్ (119)
రౌండ్ 2 : టీఆర్ఎస్ (4,659), బీజేపీ (4,851), కాంగ్రెస్ (220)
రౌండ్ 3 : టీఆర్ఎస్ (3,159), బీజేపీ (4,064), కాంగ్రెస్ (107)
రౌండ్ 4 : టీఆర్ఎస్ (3,882), బీజేపీ (4,444), కాంగ్రెస్ (234)

Read More : Huzurabad By Poll : శాలపల్లి ఓటర్లు బీజేపీ వైపు, రసవత్తరంగా ఉప ఎన్నికల ఫలితాలు

రౌండ్ 5 : టీఆర్ఎస్ (4,014), బీజేపీ (4,358), కాంగ్రెస్ (132)
రౌండ్ 6 : టీఆర్ఎస్ (3,639), బీజేపీ (4,656), కాంగ్రెస్ (180)
రౌండ్ 7 : టీఆర్ఎస్ (3,792), బీజేపీ (4,038), కాంగ్రెస్ (89)
రౌండ్ 8 : టీఆర్ఎస్ (4,248), బీజేపీ (4,086), కాంగ్రెస్ (89)

Read More : Badvel By Poll : వైసీపీ అభ్యర్థి విజయం

రౌండ్ 9 : టీఆర్ఎస్ (3,470), బీజేపీ (5,305), కాంగ్రెస్ (174)
రౌండ్ 10 : టీఆర్ఎస్ (3,709), బీజేపీ (4,326), కాంగ్రెస్ (104)
రౌండ్ 11 : టీఆర్ఎస్ (4,326), బీజేపీ (3,941), కాంగ్రెస్ (104)
రౌండ్ 12 : టీఆర్ఎస్ (3,623), బీజేపీ (4,849), కాంగ్రెస్ (158)
రౌండ్ 13 : టీఆర్ఎస్ (4,836), బీజేపీ (2,971).