Huzurabad By Poll : శాలపల్లి ఓటర్లు బీజేపీ వైపు, రసవత్తరంగా ఉప ఎన్నికల ఫలితాలు

దళిత బంధు పథకం ప్రారంభించిన గ్రామంలోనూ బీజేపీ అధిక్యం కనబరించిందని, ఈ ఫలితాలతో టీఆర్ఎస్ పతనం ప్రారంభమైనట్లుగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ చెప్పుకొచ్చారు.

Huzurabad By Poll : శాలపల్లి ఓటర్లు బీజేపీ వైపు, రసవత్తరంగా ఉప ఎన్నికల ఫలితాలు

Hzb KCR

Huzurabad Shalapally Village : హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా సాగుతున్నాయి. నువ్వా..నేనా అన్నట్లుగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొదటి రౌండ నుంచి..బీజేపీ అభ్యర్థి ఈటల ఆధిక్యం కనబరుస్తూ వస్తున్నారు. అయితే..స్వల్ప మెజార్టీ వస్తుండడంతో రానున్న రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యంలోకి వస్తారని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే..శాలపల్లి ఓటర్లు తమ వైపు ఉంటారని టీఆర్ఎస్ భావించింది. ఎందుకంటే..ఇక్కడ దళిత బంధు పథకాన్ని ప్రారంభించడం…స్వయంగా సీఎం కేసీఆర్ అట్టహాసంగా దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Read More : Huzurabad : రోటీ మేకర్.. కారు కొంపను ముంచనుందా ?

ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ వైపు ఉంటారని..ఆయనకే ఓట్లు పడుతాయని టీఆర్ఎస్ నేతలు భావించారు. కానీ అలా జరగలేదు. అనూహ్యంగా..బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ వైపు మొగ్గు చూపడం విశేషం. శాలపల్లి గ్రామంలో బీజేపీ 129 ఓట్లు అధిక్యత సాధించింది. మొత్తం ఈ గ్రామంలో 493 ఓట్లు ఉన్నాయి. బీజీపీకి 311 ఓట్లు పోలవగా…టీఆర్ఎస్ కు 182 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీనిపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు.

Read More : AP : రఘువీరారెడ్డిని స్తంభానికి కట్టేసింది ఎవరు ?

ఉప ఎన్నికల ఫలితాల పరిణామాలపై ఆమె మీడియాతో మాట్లాడారు. దళిత బంధు పథకం ప్రారంభించిన గ్రామంలోనూ బీజేపీ అధిక్యం కనబరించిందని, ఈ ఫలితాలతో టీఆర్ఎస్ పతనం ప్రారంభమైనట్లుగా చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయారని, అధికార పార్టీ పెద్ద ఎత్తున ఖర్చు పెట్టినా…హుజూరాబాద్ ప్రజలు ఆత్మగౌరవానికి పెద్దపీట వేశారని చెప్పారు. ఈటల భారీ మెజార్టీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు డీకే అరుణ.