Hyderabad: మహిళలకు పోర్న్ వీడియోలు పంపుతున్న వ్యక్తి అరెస్టు

58 ఏళ్ల రాయ్‌సుద్దీన్‌ భార్య, అతడికి కొంతకాలంగా దూరంగా ఉంటోంది. దీంతో ఫేస్‌బుక్‌లో మహిళల ప్రొఫైల్స్ వెతకడం ప్రారంభించాడు. అందులో మొబైల్ నెంబర్స్ కనిపించే మహిళా అకౌంట్ల ఫ్రొఫైల్స్ నుంచి నెంబర్లు సేకరించాడు.

Hyderabad: మహిళలకు పోర్న్ వీడియోలు పంపుతున్న వ్యక్తి అరెస్టు

Hyderabad

Hyderabad: కొంతకాలంగా మహిళలకు పోర్న్ వీడియోలు పంపుతూ వేధిస్తున్న వ్యక్తిని హైదరాబాద్ షీ టీమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని బజార్‌ఘాట్ ఏరియాకు చెందిన రాయ్‌సుద్దీన్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 58 ఏళ్ల రాయ్‌సుద్దీన్‌ భార్య, అతడికి కొంతకాలంగా దూరంగా ఉంటోంది. దీంతో ఫేస్‌బుక్‌లో మహిళల ప్రొఫైల్స్ వెతకడం ప్రారంభించాడు. అందులో మొబైల్ నెంబర్స్ కనిపించే మహిళా అకౌంట్ల ఫ్రొఫైల్స్ నుంచి నెంబర్లు సేకరించాడు. వారికి తన ఫోన్ నుంచి పోర్న్ వీడియోలు పంపేవాడు.

Booster Dose: బూస్టర్ డోసు కాల పరిమితి తగ్గించిన కేంద్రం.. ఇకపై ఆరు నెలలే!

అలా కొన్ని నెలలుగా ఐదుగురికంటే ఎక్కువ మంది మహిళలకు పోర్న్ వీడియోలు సెండ్ చేసేవాడు. ఒకవేళ రాయ్‌సుద్దీన్‌ నెంబర్ బ్లాక్ చేస్తే, వేరే నెంబర్ నుంచి వీడియోలు పంపేవాడు. అలా మొత్తం మూడు వేర్వేరు నెంబర్ల నుంచి వీడియోలు పంపుతూ, వేధింపులకు గురి చేసేవాడు. దీనిపై ఒక మహిళ బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న హైదరాబాద్ షీ టీమ్ పోలీసులు విచారణ జరిపారు. తాజాగా నిందితుడిని గుర్తించి, అరెస్టు చేశారు.