Kiran Bedi: సిక్కులపై కామెంట్ చేసినందుకు క్షమాపణ కోరుతున్న కిరణ్ బేడీ

మాజీ ఐపీఎస్ కిరణ్ బేడీ సిక్కులపై చేసిన కామెంట్లకు ఆమే స్వయంగా క్షమాపణలు కోరుతున్నారు. 'భయంలేని పాలన' (ఫియర్‌లెస్ గవర్నెన్స్) అనే బుక్ రాసిన ఆమె లాంచింగ్ కార్యక్రమంలో ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Kiran Bedi: సిక్కులపై కామెంట్ చేసినందుకు క్షమాపణ కోరుతున్న కిరణ్ బేడీ

Kiran Bedi

 

 

Kiran Bedi: మాజీ ఐపీఎస్ కిరణ్ బేడీ సిక్కులపై చేసిన కామెంట్లకు ఆమే స్వయంగా క్షమాపణలు కోరుతున్నారు. ‘భయంలేని పాలన’ (ఫియర్‌లెస్ గవర్నెన్స్) అనే బుక్ రాసిన ఆమె లాంచింగ్ కార్యక్రమంలో ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కిరణ్ బేడీ కామెంట్లను ఆమ్ ఆద్మీ పార్టీ నేత, జమైల్ సింగ్ ఖండించారు. “మొగల్స్ ఇండియాలోకి చొరబడి దోచుకుంటున్న సమయంలో సిక్కులు ప్రతిదాడికి దిగి కూతుళ్లు, సోదరీమణులైన భారతీయులను కాపాడారు. మొగల్స్ అటాక్ చేసిన సమయం రాత్రి 12గంటలు. అదే 12గంటల సమయానికి ఉన్న చరిత్ర” అని వివరించారు.

“గౌరవించడానికి బదులుగా సిక్కులపై సరదా కామెంట్లు చేస్తున్న వాళ్ల చీప్ మెంటాలిటీని చూస్తుంటే.. బీజేపీ లీడర్ల పట్ల సిగ్గుగా ఉంది” అంటూ హిందీలో ట్వీట్ చేశారు జమైల్ సింగ్.

Read Also: కిరణ్ బేడీకి కోర్టు ఆంక్షలు :పాలనలో జోక్యం చేసుకోవద్దు

ఈ కామెంట్ల తర్వాత కిరణ్ బేడీ క్షమాపణ కోరుతూ ట్వీట్లు చేశారు. “నా సంఘం పట్ల నాకు అత్యంత గౌరవం ఉంది. బాబా నానక్ దేవ్ జీకి భక్తురాలినే. నా మాటలను తప్పుగా అనుకోవద్దు. దీనికి క్షమాపణ కోరుతున్నా. నా వ్యాఖ్యలతో మరెవ్వరూ బాధపడకూడదని కోరుకుంటున్నా” అని బేడీ ట్వీట్ చేశారు.

ట్విట్టర్‌లో ట్రోలింగ్ ఎదుర్కొంటున్నబేడీ ఈమెయిల్, WhatApp హ్యాండిల్‌లోనూ అసభ్యకరమైన మెసేజ్ లను అందుకున్నారట. ఇకపై ఇటువంటివి రాకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆమె ట్వీట్ చేశారు.