కిరణ్ బేడీకి కోర్టు ఆంక్షలు :పాలనలో జోక్యం చేసుకోవద్దు

  • Published By: veegamteam ,Published On : April 30, 2019 / 07:45 AM IST
కిరణ్ బేడీకి కోర్టు ఆంక్షలు :పాలనలో జోక్యం చేసుకోవద్దు

పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడికి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గవర్నర్ గా కిరణ్ బేడీ అధికారాలపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు విధించింది. రోజువారీ పాలనా వ్యవహారాల్లో ఆమె జోక్యం చేసుకోవద్దంటు హైకోర్టు పేర్కొంది. కాగా కిరణ్ బేడీ వ్యహారంపై సీఎం నారాయణ స్వామి గతంలో ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. 
 

కాగా కోర్టు విధించిన ఈ ఆంక్షలతో పాండిచ్చేరి CM నారాయణస్వామికి ఉపసపనం లభించింది. కేంద్ర పాలితప్రాంతం రోజువారి కార్యకలాపాల్లో జోక్యం చేసుకునే అధికారం గవర్నర్‌గా కిరణ్‌బేడీకి లేదని కోర్టు తేల్చి చెప్పింది. పాండిచ్చేరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణన్ 2017లో మద్రాస్ హైకోర్టులో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అధికారాలపై, కేంద్రపాలిత ప్రాంతంపై గవర్నర్ పెత్తనం తదితర అంశాలపై ప్రశ్నిస్తూ రిట్ పిటిషన్ దాఖలు వేసిన సంగతి తెలిసిందే.