ICC: ఐసీసీ కీల‌క నిర్ణయం.. ఇకపై పురుషుల, మహిళల జట్లకు సమాన ప్రైజ్ మనీ

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ క్ర‌మంలో మ‌హిళ‌ల క్రికెట్ కు శుభ‌వార్త చెప్పింది. ఐసీసీ నిర్వ‌హించే పురుషుల‌, మ‌హిళల ఈవెంట్ల‌లో ప్రైజ్‌మ‌నీ స‌మానంగా ప్రైజ్‌మ‌నీని అందించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ICC: ఐసీసీ కీల‌క నిర్ణయం.. ఇకపై పురుషుల, మహిళల జట్లకు సమాన ప్రైజ్ మనీ

ICC announces equal prize mone

ICC announces equal prize money : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ క్ర‌మంలో మ‌హిళ‌ల క్రికెట్ కు శుభ‌వార్త చెప్పింది. ఐసీసీ నిర్వ‌హించే పురుషుల‌, మ‌హిళల ఈవెంట్ల‌లో అందించే ప్రైజ్‌మ‌నీ ని  ఇక నుంచి స‌మానంగా అందించ‌నున్న‌ట్లు  ప్ర‌క‌టించింది. ద‌క్షిణాఫ్రికాలోని డ‌ర్భ‌న్‌లో నిర్వ‌హించిన ఐసీసీ వార్షిక కాన్ఫ‌రెన్స్‌లో ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. అంతేకాకుండా టెస్టు క్రికెట్‌లో ఓవ‌ర్ రేట్ ఆంక్ష‌ల‌లో కూడా ప‌లు మార్పులు చేసింది.

పురుషుల, మహిళల ఈవెంట్‌లకు సమాన ప్రైజ్ మనీ

ఐసీసీ నిర్వ‌హించే పురుషుల, మహిళల ఈవెంట్‌లకు స‌మాన ప్రైజ్‌మ‌నీ ని అందించాల‌ని నిర్ణ‌యించారు. పురుషులు, మ‌హిళ‌లు పోల్చ‌ద‌గిన ఈవెంట్ల‌లో విజేత‌కు, మిగిలిన స్థానాల్లోని జ‌ట్ల‌కు అందించే మొత్తం స‌మానంగా ఉండ‌నుంది. అలాగే మ్యాచ్ లో గెలిచిన జ‌ట్ల‌కు అందించే ప్రైజ్‌మ‌నీ ని సైతం స‌మానంగా అందించ‌బడుతుంది.

Duleep Trophy Final : ఇలాగైతే చోటు క‌ష్ట‌మే.. విఫ‌ల‌మైన పుజారా, సూర్య‌కుమార్‌.. స‌ర్ఫ‌రాజ్ ఖాన్ డ‌కౌట్‌

దీనిపై ICC ఛైర్మన్ గ్రెగ్ బార్ల్కే మాట్లాడుతూ.. క్రీడా చ‌రిత్ర‌లో ఇది ఓ ముఖ్య‌మైన ఘ‌ట్టం అని అన్నారు. ఐసీసీ గ్లోబ‌ల్ ఈవెంట్ల‌లో పోటీప‌డుతున్న‌ప్పుడు పురుషులు, మహిళా క్రికెటర్లకు ఇప్పుడు సమానంగా రివార్డ్‌లు అందజేయ‌నుండ‌డం త‌న‌కు ఆనందాన్ని క‌లిగిస్తోంద‌న్నాడు. 2017 నుంచే దీనిపై దృష్టి సారించామ‌ని.. అప్ప‌టి నుంచి మ‌హిళ‌ల ఈవెంట్ల‌లో ప్రైజ్‌మ‌నీ ని పెంచుతూ వ‌స్తున్న‌ట్లు వెల్ల‌డించారు. మ‌హిళ‌లు టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2020, 2023లో విజేత‌లు, ర‌న్న‌ర‌ప్‌లు వ‌రుస‌గా 1 మిలియన్, $500,00 డాల‌ర్లు అందుకున్నారు. ఇది 2018లో అందిన మొత్తం కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ అని చెప్పారు.

Asian Athletics Championships : చ‌రిత్ర సృష్టించిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్రీడాకారిణి.. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వ‌ర్ణం

ఇక నుంచి మ‌హిళ‌లు వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ గెలిచినా, పురుషులు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ గెలిచినా గానీ ఒకే మొత్తాన్ని ప్రైజ్‌మ‌నీగా అందుకుంటారు. టీ 20 ప్రపంచ కప్‌లు, U19 ప్ర‌పంచ‌క‌ప్‌కు కూడా ఇదే విధానం వ‌ర్తిస్తుంద‌ని అని గ్రెగ్ బార్ల్కే అన్నారు.

ఓవ‌ర్ రేట్ ఆంక్ష‌ల్లో మార్పులు

చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ టెస్ట్ క్రికెట్‌లో ఓవర్-రేట్ ఆంక్షలకు మార్పులను ఆమోదించింది. ఓవర్ రేట్‌లను నిర్వహించడం, ఆటగాళ్లకు సరసమైన వేతనం ఉండేలా చూసుకోవడం అవసరం అని అభిప్రాయ‌ప‌డింది. నిర్ణీత స‌మ‌యం క‌న్నా త‌క్కువ ఓవ‌ర్లు వేస్తే.. ఒక్కో ఓవ‌ర్‌కు ఆట‌గాళ్ల‌కు వారి మ్యాచ్ ఫీజులో 5శాతం జ‌రిమానా విధించ‌బ‌డుతుంది. గ‌రిష్టంగా 50 శాతం వ‌ర‌కు ఫైన్ ప‌డ‌నుంది. ప్ర‌స్తుత ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ సైకిల్ నుంచే ఈ నిబంధ‌న వ‌ర్తించ‌నుంది.

Ravichandran Ashwin : చ‌రిత్ర సృష్టించిన అశ్విన్‌.. అనిల్ కుంబ్లే రికార్డు బ్రేక్‌.. తండ్రీకొడుకును ఔట్ చేసిన మొన‌గాడుICC announces e

కొత్త బంతికి 80 ఓవర్ల సమయానికి ముందు జట్టును అవుట్ చేస్తే, స్లో ఓవర్ రేట్ ఉన్నప్పటికీ ఓవర్ రేట్ పెనాల్టీ వర్తించదు. ఇది ప్రస్తుత 60-ఓవర్ థ్రెషోల్డ్‌ని భర్తీ చేస్తుంది.