Asian Athletics Championships : చ‌రిత్ర సృష్టించిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్రీడాకారిణి.. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వ‌ర్ణం

బ్యాంకాక్‌లో జ‌రుగుతున్న ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియ‌న్ షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి జ్యోతి యర్రాజి (Jyothi Yarraji) చ‌రిత్ర సృష్టించింది.

Asian Athletics Championships : చ‌రిత్ర సృష్టించిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్రీడాకారిణి.. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వ‌ర్ణం

Jyothi Yarraji

Updated On : July 13, 2023 / 8:36 PM IST

Asian Athletics Championships 2023 : బ్యాంకాక్‌లో జ‌రుగుతున్న ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియ‌న్ షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి జ్యోతి యర్రాజి (Jyothi Yarraji) చ‌రిత్ర సృష్టించింది. మ‌హిళ‌ల 100 మీట‌ర్ల హ‌ర్డిల్స్ రేసులో విజేత‌గా నిలిచి స్వ‌ర్ణ ప‌త‌కాన్ని కైవ‌సం చేసుకుంది. విశాఖ‌కు చెందిన 23 ఏళ్ల జ్యోతికి అంత‌ర్జాతీయ పోటీల్లో ఇదే తొలి స్వ‌ర్ణం. గురువారం జ‌రిగిన ఫైన‌ల్స్‌లో జ‌పాన్ అథెట్లు టెరాడా సుకా(13.13 సెక‌న్లు), అయోకి మ‌సుమి(13.26 సెక‌న్ల) కంటే అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న చేసి 13.09 సెక‌న్ల‌లోనే ల‌క్ష్యాన్ని చేరుకుంది. ఈ పోటీల చరిత్రలోనే 100 మీటర్ల హార్డిల్స్‌లో జ్యోతి దేశానికి తొలి స్వర్ణం అందించింది. జ్యోతి జాతీయ రికార్డు 12.82 సెకన్లుగా ఉంది.

Duleep Trophy Final : ఇలాగైతే చోటు క‌ష్ట‌మే.. విఫ‌ల‌మైన పుజారా, సూర్య‌కుమార్‌.. స‌ర్ఫ‌రాజ్ ఖాన్ డ‌కౌట్‌

Ind vs WI : మ‌హ్మ‌ద్ సిరాజ్ కళ్లు చెదిరే క్యాచ్.. శుభ్‌మన్ గిల్ అదిరిపోయే డ్యాన్స్‌.. వీడియోలు వైర‌ల్‌

ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ రెండో రోజు భారత్ మొత్తం మూడు స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. మహిళా 100 మీటర్ల హ‌ర్డిల్స్ రేసులో జ్యోతి యర్రాజీ, పురుషుల 1500 మీటర్ల రేసులో
అజయ్ కుమార్ సరోజ్, పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో కామన్వెల్త్ గేమ్స్ రజత పతక విజేత అబ్దుల్లా అబూబకర్ లు స్వ‌ర్ణ ప‌త‌కాల‌ను అందుకున్నారు.

Ravichandran Ashwin : చ‌రిత్ర సృష్టించిన అశ్విన్‌.. అనిల్ కుంబ్లే రికార్డు బ్రేక్‌.. తండ్రీకొడుకును ఔట్ చేసిన మొన‌గాడు