icc men’s rankings: వ‌న్డే ర్యాంకింగ్స్‌లో అద‌ర‌గొట్టిన బుమ్రా

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా పేస‌ర్ జ‌స్ప్రిత్ బుమ్రా అద‌ర‌గొట్టాడు. వ‌న్డేల్లో బౌలింగ్‌లో 718 రేటింగ్‌తో తిరిగి నంబ‌ర్ 1 స్థానానికి చేరుకున్నాడు. వ‌న్డేల్లో బౌలింగ్‌లో మ‌రే భార‌త ఆట‌గాడికీ టాప్‌-10లో చోటుద‌క్క‌లేదు. అలాగే, సూర్య‌కుమార్ యాద‌వ్ టీ20ల్లో కెరీర్‌లోనే అత్యుత్త‌మ స్థానానికి ఎగ‌బాకాడు.

icc men’s rankings: వ‌న్డే ర్యాంకింగ్స్‌లో అద‌ర‌గొట్టిన బుమ్రా

Bumra

icc men’s rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా పేస‌ర్ జ‌స్ప్రిత్ బుమ్రా(jasprit bumrah) అద‌ర‌గొట్టాడు. వ‌న్డేల్లో బౌలింగ్‌లో 718 రేటింగ్‌తో తిరిగి నంబ‌ర్ 1 స్థానానికి చేరుకున్నాడు. వ‌న్డేల్లో బౌలింగ్‌లో మ‌రే భార‌త ఆట‌గాడికీ టాప్‌-10లో చోటుద‌క్క‌లేదు. అలాగే, సూర్య‌కుమార్ యాద‌వ్ టీ20ల్లో కెరీర్‌లోనే అత్యుత్త‌మ స్థానానికి ఎగ‌బాకాడు. బ్యాటింగ్‌లో ఐదో స్థానానికి చేరుకున్నాడు. బ్యాటింగ్‌లో భార‌త్‌కు చెందిన మ‌రే ఆట‌గాడికి టాప్‌-10లో చోటు ద‌క్క‌లేదు.

Sri Lankan Economic Crisis: శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా విక్రమసింఘే బాధ్యతల స్వీకరణ!

టీ20ల్లో ఆస్ట్రేలియా బౌలర్‌ జోష్ హ‌జ్లెవూడ్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. వ‌న్డేల్లో పాక్ బ్యాట్స్‌మ‌న్‌ బాబ‌ర్ అజాం (892 రేటింగ్) అగ్ర‌స్థానంలో ఉన్నాడు. టీ20ల్లోనూ బ్యాటింగ్‌లోబాబ‌ర్ అజాం (818 రేటింగ్) అగ్ర‌స్థానంలో నిలిచాడు. టీ20ల్లో భువ‌నేశ్వ‌ర్ కుమార్ 8వ స్థానంలో నిలిచాడు. కాగా, టెస్టుల్లో బ్యాటింగ్‌లో అగ్ర‌స్థానంలో ఇంగ్లండ్ ఆట‌గాడు జో రూట్, బౌలింగ్‌లో ఆస్ట్రేలియా ఆట‌గాడు ప్యాట్ క‌మ్మిన్స్, ఆల్ రౌండ‌ర్‌లో టీమిండియా ఆట‌గాడు ర‌వీంద్ర జ‌డేజా తొలిస్థానాల్లో కొన‌సాగుతున్నారు.

Afghan girls: తాలిబన్ల పాలనలో అగమ్యగోచరంగా అఫ్గాన్ బాలికల పరిస్థితి

ఇక టెస్టుల్లో ఆస్ట్రేలియా (128 రేటింగ్‌) అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది. టీమిండియా రెండో స్థానంలో, సౌతాఫ్రికా మూడో స్థానంలో ఉంది.

వ‌న్డే ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ జ‌ట్టు 127 రేటింగ్‌తో అగ్ర‌స్థానంలో నిల‌వ‌గా, ఇంగ్లండ్ (122) రెండో స్థానంలో, టీమిండియా (108) మూడు, పాకిస్థాన్ (106) నాలుగో స్థానాల్లో ఉన్నాయి.

టీ20 ర్యాంకింగ్స్‌లో భార‌త్ (270 రేటింగ్) అగ్రస్థానంలో, ఇంగ్లండ్ రెండో స్థానంలో, పాకిస్థాన్ మూడో స్థానంలో ఉన్నాయి.