Indiaw vs Englandw : భారత్ పేలవ ప్రదర్శన.. ఇంగ్లాండ్ టార్గెట్ 135

కెప్టెన్ మిథాలీ రాజ్ కేవలం ఒక్క పరుగు చేసి వెనుదిరిగారు. దీంతో క్రీడాభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. కేవలం 36.2 ఓవర్లలో 134 పరుగులు సాధించి భారత్ ఆలౌట్ అయ్యింది...

Indiaw vs Englandw : భారత్ పేలవ ప్రదర్శన.. ఇంగ్లాండ్ టార్గెట్ 135

Team India Mithai

Updated On : March 16, 2022 / 12:03 PM IST

ICC Women’s World Cup : ప్రపంచకప్ కొట్టేయాలని చూస్తున్న భారత్ మహిళల టీం ఇంగ్లాండ్ జట్టుతో ఢీకొంటోంది. మూడు మ్యాచ్ ల్లో రెండింటి విజయం సాధించిన మిథాలీ టీం.. ఈ మ్యాచ్ లో కూడా విజయం సాధించాలని భావిస్తోంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ టీం బౌలింగ్ ఎంచుకుంది. బౌలర్లు చుక్కలు చూపించారు. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో రాణించిన స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్ లు ఈ మ్యాచ్ లో ఘోరంగా విఫలం చెందారు. కెప్టెన్ మిథాలీ రాజ్ కేవలం ఒక్క పరుగు చేసి వెనుదిరిగారు. దీంతో క్రీడాభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. కేవలం 36.2 ఓవర్లలో 134 పరుగులు సాధించి భారత్ ఆలౌట్ అయ్యింది.

Read More : Indiaw vs Englandw : భారత్ పేలవ ప్రదర్శన.. ఇంగ్లాండ్ టార్గెట్ 135

ఓపెనర్ స్మృతి మంధాన, యాస్తిక భాటియా ఆటను ప్రారంభించారు. జట్టు స్కోరు 18 పరుగుల వద్ద భాటియా (8) వికెట్ కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్ వచ్చిన మిథాలీ రాజ్ బ్యాట్ ఝులిపిస్తుందని అందరూ భావించారు. కేవలం ఒకేఒక్క పరుగు సాధించి అలా వచ్చి.. ఇలా వెళ్లిపోయారు. దీప్తి శర్మ డకౌట్ కాగా… హర్మన్ ప్రీత్ కౌర్..స్మృతి మంధానకు జత కలిశారు. వికెట్ పోకుండా నిలకడగా ఆడారు. జట్టు స్కోరు 50 పరుగులు దాటింది. వీరి భాగస్వామ్యాన్ని విడగొట్టారు ఇంగ్లాండ్ జట్టు.

Read More : ICC Player of the Month: ఐసీసీ స్పెషల్ అవార్డు, బెస్ట్ ఫీల్డర్‌గా నిలిచిన కుక్క

జట్టు స్కోరు 61 పరుగుల వద్ద హర్మన్ ప్రీత్ కౌర్ (14) అవుట్ అయ్యారు. వెంటనే స్నేహ్ రానా (0) పెవిలియన్ చేరారు. ఒంటరిగా రాణించిన మంధాన (35) కూడా అవుట్ అవడంతో క్రీడాభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. చివరిలో రిచా ఘోష్ జట్టు స్కోరు పెంచడానికి కృషి చేశారు. 33 పరుగులు సాధించిన రిచా రనౌట్ అయ్యారు. పూజా (6), జూలన్ గోస్వామి (20), మేఘనా సింగ్ (3), రాజేశ్వరీ గైక్వాడ్ (1) సాధించి అవుట్ అయ్యారు. దీంతో భారత మహిళల టీం 36.2 ఓవర్లలో 134 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.