Health : పెరుగుతో కలిపి ఎండుద్రాక్ష తీసుకుంటే!…

పెరుగు, ఎండు ద్రాక్ష తీసుకోవటం వల్ల మలబద్ధక సమస్యను దూరం చేసుకోవచ్చు. శరీరంలో శక్తిని పెంచుకోవటానికి ఈ ఆహారం ఎంతో ఉపయోగపడుతుంది.

Health : పెరుగుతో కలిపి ఎండుద్రాక్ష తీసుకుంటే!…

Curd,kismiss1

Health : ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండాలంటే తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పెరుగు, ఎండు ద్రాక్ష ను ఆహారంలో చేర్చుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్యంగా ఉండేందుకు ఈ రెండింటిని కలిపి తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుందని ఆరోగ్యనిపుణులు సైతం సూచిస్తున్నారు. మనం చెప్పుకున్న వాటిలో పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎండాకాలంలో చాలా మంది ప్రతిరోజు పెరుగుతింటారు. చర్మసౌందర్యాన్ని, జీర్ణక్రియలకు ఇది ఎంతో మేలు చేస్తుంది.

అలాగే ఎండు ద్రాక్షలు డ్రై ఫ్రూట్స్ గా చెప్తారు. వీటిని రుచిని ఎక్కవ మంది ఆస్వాదిస్తుంటారు. ఎండు ద్రాక్షలో ఐరన్, పొటాషియం, కాల్సియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. పెరుగులో కాల్షియం, ప్రొటీన్, లాక్టోస్, ఐరన్, ఫాస్పరస్, రిబోఫ్లావిన్ , విటమిన్ బి 6, బి 12 ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

పెరుగు, ఎండు ద్రాక్ష కలిపి తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బలమైన రోగనిరోధక శక్తిని పెంచటంలో ఈ ఆహారం ఎంతో తోడ్పడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభించటం వల్ల జబ్బుల భారిన పడే అవకాశం దగ్గుతుంది. చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా చర్మంపై మొటిమలు మచ్చలు తగ్గించటంలో పెరుగు, ఎండు ద్రాక్ష దోహదపడతాయి. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియా గుణాలు చర్మానికి మేలు చేస్తాయి.

పెరుగు, ఎండు ద్రాక్ష తీసుకోవటం వల్ల మలబద్ధక సమస్యను దూరం చేసుకోవచ్చు. శరీరంలో శక్తిని పెంచుకోవటానికి ఈ ఆహారం ఎంతో ఉపయోగపడుతుంది. వేసవి కాలంలో ఇది శరీరాన్ని చల్లబరిచేందుకు ఈ మిశ్రమం దోహదం చేస్తుంది. ఎముకలు బలోపేతం అవుతాయి. కీళ్లవాపు సమస్య నుండి విముక్తి పొందవచ్చు. రక్తపోటు సమస్య దూరమౌతుంది. అంతేకాకుండా మగవారిలో వీర్యకణాల నాణ్యత మెరుగుపరచటంలో దీనిని మించింది లేదనే చెప్పాలి.

పెరుగు, ఎండు ద్రాక్ష మిశ్రమం తయారీ ;

ముందుగా ఒక గిన్నెలో పాలను వేడి చేసి చల్లారనివ్వాలి. అందులో తగినంత మొత్తంలో ఎండు ద్రాక్షలను వేసుకోని కొద్దిగ పెరుగు వేసుకుని తోడు పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని 8గంటలపాటు కదపకుండా అలాగే ఉంచాలి. అలా పెట్టుకున్న మిశ్రమం గట్టిపడి పెరుగుగా మారుతంది. ఆ మిశ్రమాన్ని ఆహారంగా తీసుకోవాలి.