PM Modi: లక్ష్యాన్ని ముందే సాధించిన భారత్: మోదీ

పెట్రోల్‌లో పది శాతం ఇథనాల్ కలపాలన్న లక్ష్యాన్ని భారత్ ఐదు నెలల ముందుగానే సాధించిందన్నారు ప్రధాని మోదీ. దీని ద్వారా దేశంలో కర్బన ఉద్గారాలు తగ్గాయని, నిధులు ఆదా అయ్యాయని, రైతులకు మేలు జరిగిందన్నారు.

PM Modi: లక్ష్యాన్ని ముందే సాధించిన భారత్: మోదీ

Pm Modi

PM Modi: పెట్రోల్‌లో పది శాతం ఇథనాల్ కలపాలన్న లక్ష్యాన్ని భారత్ ఐదు నెలల ముందుగానే సాధించిందన్నారు ప్రధాని మోదీ. దీని ద్వారా దేశంలో కర్బన ఉద్గారాలు తగ్గాయని, నిధులు ఆదా అయ్యాయని, రైతులకు మేలు జరిగిందన్నారు. వరల్డ్ ఎన్విరాన్‌మెంట్ డే సందర్భంగా సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలోని ఇషా ఫౌండేషన్ ఢిల్లీలో ఏర్పాటు చేసిన ‘సేవ్ సాయిల్ మూమెంట్’ కార్యక్రమంలో భాగంగా మోదీ మాట్లాడారు.

Pawan Kalyan As CM: పవన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి.. బీజేపీకి జనసేన అల్టిమేటమ్

‘‘2014లో పెట్రోల్‌లో 1.5 శాతం మాత్రమే ఇథనాల్ కలిపేవాళ్లం. ఇప్పుడు పది శాతం ఇథనాల్ కలుపుతున్నాం. దీనివల్ల 27 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గాయి. ఎనిమిదేళ్ల కాలంలో రూ.41,000 కోట్లు మిగిలాయి. రైతులకు అదనంగా రూ.40,000 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సగటున ఒక మనిషికి నాలుగు టన్నుల ఉద్గారాలు ఉంటే, మన దేశంలో మాత్రం అర టన్ను మాత్రమే విడుదలవుతోంది. శిలాజ రహిత విద్యుత్ ద్వారా 40 శాతం విద్యుత్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని కూడా తొమ్మిదేళ్ల ముందుగానే సాధించాం. గత ఎనిమిదేళ్లలో 20 వేల చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం పెరిగింది. దీనివల్ల అటవీ జంతువుల సంఖ్య కూడా పెరిగింది. సహజ వనరుల ద్వారా విద్యుత్ లక్ష్యాన్ని సాధించేందుకు భారత్ తీవ్రంగా కృషి చేస్తోంది. సాయిల్ హెల్త్ కార్డు ద్వారా కోట్లాది మంది రైతులు ఎరువులు, సూక్ష్మ పోషకాల గురించిన సమాచారాన్ని తెలుసుకోగలుగుతున్నారు.

Girl Sexually Assaulted: హైదరాబాద్‌లో దారుణం.. మరో మైనర్ బాలిక కిడ్నాప్, లైంగిక దాడి

దేశంలో 22 కోట్ల సాయిల్ హెల్త్ కార్డులు ఉన్నాయి. వాతావరణ మార్పుల్లో మన పాత్ర లేకపోయినా, పర్యావరణ పరిరక్షణకు భారత్ తీవ్రంగా కృషి చేస్తోంది. అభివృద్ది చెందిన దేశాలు వనరులను దోపీడి చేస్తూ, అధిక కర్బన ఉద్గారాలకు కారణమవుతున్నాయి’’ అని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.