India Covid-19 Update : దేశంలో కొత్తగా 1,67,059 కోవిడ్ కేసులు నమోదు

దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య నిన్న కాస్త తగ్గుముఖం పట్టింది.  దేశవ్యాప్తంగా సోమవారం 1,67,059 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

India Covid-19 Update : దేశంలో కొత్తగా 1,67,059 కోవిడ్ కేసులు నమోదు

india Covid up date

India Covid-19 Update : దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య నిన్న కాస్త తగ్గుముఖం పట్టింది.  దేశవ్యాప్తంగా సోమవారం 1,67,059 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4,14,69,499 కు చేరింది. ప్రస్తుతం దేశంలో 17,43,059 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. దేశంలో కోవిడ్ పాజిటివిటి రేటు 96.62 శాతంగా ఉంది.

దేశంలో తాజాగా 1,192 మంది కోవిడ్ తదితర కారణాలతో మరణించగా…ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,96,242 కి చేరింది. నిన్న కోవిడ్ నుంచి 2,54,076 మంది కోలుకున్నారు. ఇక దేశ వ్యాప్తంగా రికవరీల సంఖ్య 3,92,30,198 కు చేరింది.

ఇక రోజు వారి కరోనా పాజివీటి శాతం 11.69% గా నమోదు అయింది. ఇండియాలో యాక్టివ్ కరోనా కేసులు 4.20% గా నమోదు అయింది.  ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,66,68,48,204 మందికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కోవిడ్ వ్యాక్సిన్లు వేసింది. నిన్న ఒక్కరోజు దేశంలో 61 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు.