India Corona: 20వేలకుపైనే.. దేశంలో కొనసాగుతున్న కొవిడ్ ఉధృతి.. ఒకేరోజు 47 మంది మృతి

దేశంలో కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. నిన్న కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 20వేల మార్కును దాటగా.. శుక్రవారంసైతం 20వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

India Corona: 20వేలకుపైనే.. దేశంలో కొనసాగుతున్న కొవిడ్ ఉధృతి.. ఒకేరోజు 47 మంది మృతి

COVID-19

India Corona: దేశంలో కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. నిన్న కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 20వేల మార్కును దాటగా.. శుక్రవారంసైతం 20వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం.. గడిచిన 24గంటల్లో 4.50 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 20,038 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకు కొవిడ్ బారిన పడిన వారి సంఖ్య 4,37,10,027 కి చేరింది. పాజిటివిటీ రేటు 4.44శాతంగా నమోదైంది.

Covid-19: విజృంభిస్తున్న కరోనా .. ఒక్క రోజే 20 వేల కేసులు నమోదు

ఇదిలాఉంటే థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24గంటల్లో కొవిడ్ తో చికిత్స పొందుతూ 47 మంది మృతిచెందారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 5,25,604 కి చేరింది. గురువారం కరోనా నుంచి 16,994 మంది కోలుకోగా రికవరీ రేటు 98.49శాతంగా ఉంది. దేశంలో కొవిడ్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో క్రియాశీలక కేసులు 1,39,073కి చేరాయి.  అత్యధికంగా కేరళ రాష్ట్రంలో 3,237 కొవిడ్ నిర్ధారణ కేసులు నమోదయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లో 3,029, తమిళనాడులో 2,283, మహారాష్ట్రలో 2,229, కర్ణాటకలో 1209 కేసులు నమోదయ్యాయి.

దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 199.47 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. గురువారం ఒక్కరోజు 18,92,969 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఇదిలాఉంటే నేటి నుంచి 18 సంవత్సరాలు దాటిన అందరికీ ఉచితంగా బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది.