Omicron Cases In India : భారత్‌లో ఒమిక్రాన్ కలవరం.. కేరళలో తొలి కేసు నమోదు.. 38కి పెరిగిన బాధితులు

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. భారత్ లోనూ కలవరం పుట్టించింది. దేశంలో క్రమంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు భారత్‌లో..

Omicron Cases In India : భారత్‌లో ఒమిక్రాన్ కలవరం.. కేరళలో తొలి కేసు నమోదు.. 38కి పెరిగిన బాధితులు

Omicron Cases In Country

Omicron Cases In India : యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. భారత్ లోనూ కలవరం పుట్టించింది. దేశంలో క్రమంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు భారత్‌లో ఏడు రాష్ట్రాల్లో కేసులు గుర్తించగా.. తాజాగా కేరళలోనూ తొలి కేసు నమోదైంది. బ్రిటన్‌ నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా తేలిందని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్‌ తెలిపారు.

బాధితుడు యూకే నుంచి అబుదాబి మీదుగా ఈ నెల 6న కొచ్చికి వచ్చాడు. ఆ తర్వాత రెండు రోజులకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అతని భార్య, తల్లికి సైతం కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆరోగ్యమంత్రి తెలిపారు. అయితే, సదరు వ్యక్తి వచ్చిన విమానంలో 149 మంది ప్రయాణికులు ఉన్నారని, వారిని అప్రమత్తం చేసే పనిలో ఉన్నామన్నారు.

కాగా, దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశంలో 38 కేసులు గుర్తించారు. ఈ ఒక్కరోజే 5 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, పంజాబ్ లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. మరో మూడు కేసులు మహారాష్ట్ర, కర్నాటక, కేరళలో వెలుగుచూశాయి. ఇప్పటివరకు అత్యధికంగా మహారాష్ట్రలో 18 మందికి ఈ కొత్త వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.

Obesity : చిన్నారుల ఆరోగ్యంపై ప్రభావం చూపే ఊబకాయం

దేశంలో కొత్త‌గా 7వేల 774 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. మరో 306 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 8వేల 464 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో మొత్తం 92వేల 281 మందికి చికిత్స అందుతోంది. దేశంలో క‌రోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,75,434కి పెరిగింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,41,22,795 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 132,93,84,230 వ్యాక్సిన్ డోసులు వేశారు.

కరోనావైరస్ మహమ్మారి వెలుగు చూసి.. దాదాపు 2 ఏళ్లు కావస్తోంది. ఇంకా ప్రపంచాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. ఈ రెండేళ్ల కాలంలో అనేక కొత్త వేరియంట్లు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేశాయి. కాస్త తగ్గింది.. అని ఊపిరి పీల్చుకునేలోపు కొత్త వేరియంట్ రూపంలో మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతోంది. నిన్నమొన్నటి దాకా అత్యంత ప్రమాదకారిగా డెల్టా వేరియంట్‌ వణికించింది. ఇప్పుడు డెల్టా వేరియంట్‌ ను తలదన్నే.. ఒమిక్రాన్‌ అనే మరో వేరియంట్‌ బెంబేలెత్తిస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. కరోనా తగ్గుముఖం పట్టి… సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో… కొత్త వేరియంట్ భయబ్రాంతులకు గురి చేస్తోంది.

Walking : ప్రతిరోజు వాకింగ్ ఎలా చేయాలి? ఏ సమయంలో చేస్తే బెటర్?

కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి దడ పుట్టిస్తోంది. ఇదే తరహాలో వ్యాప్తి చెందితే ఒమిక్రాన్‌ కేసులు సంఖ్య పెరుగుతూ మరోసారి దేశాన్ని అతలాకుతలం చేయడం ఖాయం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్‌ వ్యాప్తిని చూస్తుంటే థర్డ్‌ వేవ్‌ తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 57 దేశాలకు ఒమిక్రాన్ వ్యాపించింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇప్పటికే కలవరపెడున్న డెల్టా వేరియంట్‌ సహా తాజా ఒమిక్రాన్‌ కేసులు భయాందోళన రేకెత్తిస్తున్నాయి. చాపకింద నీరులా విస్తరిస్తున్న కొత్త వేరియంట్‌కు అడ్డుకట్ట వేసేందుకు చాలా వరకు దేశాలు మళ్లీ ఆంక్షల వలయంలోకి వెళ్లిపోతున్నాయి.