India Vs England : టీమిండియా చెత్త ప్రదర్శన, ఇంగ్లండ్ 42 పరుగుల ఆధిక్యం

టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా చెత్త షో ప్రదర్శించింది. లార్డ్స్‌లో అద్భుత విజయంతో సుదీర్ఘ టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌పై ఆధిక్యం సాధించిన భారత్‌.. అదే జోరు లీడ్స్‌లో కొనసాగించలేకపోయింది

India Vs England : టీమిండియా చెత్త ప్రదర్శన, ఇంగ్లండ్ 42 పరుగుల ఆధిక్యం

India

India Vs England 3rd Test Day : టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా చెత్త షో ప్రదర్శించింది. లార్డ్స్‌లో అద్భుత విజయంతో సుదీర్ఘ టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌పై ఆధిక్యం సాధించిన భారత్‌.. అదే జోరు లీడ్స్‌లో కొనసాగించలేకపోయింది. మూడో టెస్టు మొదటి రోజే బ్యాటింగ్‌లో భారత్‌ కుప్పకూలింది. ఇంగ్లండ్‌ పేసర్ల విజృంభణతో టీమ్‌ఇండియా ప్లేయర్లు పెవీలియన్‌కు క్యూ కట్టక తప్పలేదు. ఇంగ్లీష్‌ టీమ్‌ దెబ్బకు కోహ్లీ సేన 78 పరుగులకే ఢమాల్‌ అయింది. ఒకరిని మించి మరొకరు పెవిలియన్‌కు పోటీపడటంతో టెస్టుల్లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుని మూడో అత్యల్ప స్కోరును తన పేరిట రాసుకుంది టీమిండియా. కోహ్లీసేనను చిత్తుచిత్తుగా.. స్వల్ప స్కోరుకే పరిమితం చేసిన ఇంగ్లండ్‌.. బ్యాటింగ్‌లోనూ ఇరగదీసింది. ఓపెనర్లు హమీద్‌, బర్న్స్‌ అజేయ అర్ధసెంచరీలతో తొలి రోజు ఆట ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 120 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ ప్రస్తుతం 42 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

Read More : JEE: జేఈఈ 4వ సెషన్ పరీక్షలు

లార్డ్స్‌ టెస్టులో చరిత్రాత్మక విజయంతో ఆధిక్యం దక్కించుకున్న భారత్.. మూడో టెస్టులో ఆదిలోనే కోలుకోలేని దెబ్బతింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కెప్టెన్‌ కోహ్లీ నిర్ణయం బుమారాంగ్‌లా బెడిసికొట్టింది. లార్డ్స్ టెస్టు విజయం హ్యాంగోవర్‌లో ఉన్న టీమ్ ఇండియాకు.. లీడ్స్‌లో మత్తు వదిలించారు ఇంగ్లాండ్ బౌలర్లు. పరిస్థితులను అనుకూలంగా మలుచుకున్న ఇంగ్లండ్‌ పేస్‌ టీమ్‌.. భారత బ్యాట్స్‌మెన్‌ భరతం పట్టారు. లార్డ్స్‌ టెస్టు ఓటమితో కసి మీదున్న ఇంగ్లండ్‌ పేసర్లు టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ను కుప్పకూల్చారు. అండర్సన్‌ వికెట్ల వేటకు ఆరంభం పలికితే.. ఒవర్టన్‌, రాబిన్సన్‌, కరాన్‌ మిగతా పని పూర్తి చేశారు. వీరి విజృంభణతో టీమ్‌ఇండియా మొత్తం 40 పాయింట్‌ 4 ఓవర్లలో 78 పరుగులకే పెవీలియన్‌ బాట పట్టింది. ఓపెనర్‌ రోహిత్‌శర్మ, రహానే మినహా అందరూ సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. 22 పరుగుల తేడాతో భారత్‌ చివరి ఏడు వికెట్లు కోల్పోయింది.

Read More : Covid Cases In Kerala : కేరళలో మళ్లీ రికార్డు స్థాయిలో కరోనా కేసులు

మూడో టెస్టు మొదటి రోజే భారత్‌కు ఏదీ కలిసిరాలేదు. గెలువక గెలువక టాస్‌ గెలిచిన కెప్టెన్‌ కోహ్లీ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకోవడం టీమ్‌ఇండియాకు అచ్చిరాలేదు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌కు దిగిన అండర్సన్‌.. ఐదో బంతికే ఇన్‌ఫామ్‌ బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ను డఔట్‌ చేసి వికెట్ల ఖాతా తెరిచాడు. ఔట్‌ స్వింగ్‌ డెలివరీని షాట్‌ ఆడబోయిన రాహుల్‌.. కీపర్‌ బట్లర్‌ చేతికి లడ్డులా దొరికాడు. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన పుజారా కూడా డకౌట్‌ అయి.. తన పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. ఎదురొడ్డి నిలుస్తాడనుకున్న క్షణాన అండర్సన్‌ విసిరిన సూపర్‌ బంతికి రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్‌ కష్టాలు రెట్టింపయ్యాయి. ఓ ఎండ్‌లో రోహిత్‌శర్మ అడపాదడపా షాట్లతో స్కోరు బోర్డును పరిగెత్తిస్తే.. మరో ఎండ్‌లో సహకరమిచ్చే వారు కరవయ్యారు. భారీ ఇన్నింగ్స్‌ బాకీ పడిన కెప్టెన్‌ కోహ్లీ సైతం మరోమారు నిరాశపరిచాడు.