Covid Cases In Kerala : కేరళలో మళ్లీ రికార్డు స్థాయిలో కరోనా కేసులు

కేరళలో కరోనా కేసులు మళ్లీ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.

Covid Cases In Kerala : కేరళలో మళ్లీ రికార్డు స్థాయిలో కరోనా కేసులు

Kerala (3)

Updated On : August 25, 2021 / 9:52 PM IST

Covid Cases In Kerala కేరళలో కరోనా కేసులు మళ్లీ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మొహర్రం, ఓనమ్‌, రక్షాబంధన్‌ వంటి వరుస పండుగ సెలవుల అనంతరం కరోనా కేసులు మరోసారి రికార్డు స్థాయికి పెరిగాయి. ఈ ఏడాది మే 20 తర్వాత మరోసారి వైరస్‌ కేసులు 30 వేల మార్కును దాటాయి. గత 24 గంట్లలోనే 30శాతం కేసుల పెరుగుదల కనిపించింది.

కేరళలో బుధవారం 31,445 కోవిడ్ పాజిటివ్‌ కేసులు,215 మరణాలు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఎర్నాకులం జిల్లాలో అత్యధికంగా 4,048 కేసులు నమోదయ్యాయి. త్రిసూర్‌, కోజికోడ్‌, మలప్పురం జిల్లాల్లో మూడు వేలకు పైగా కేసులు నమోదైనట్లు కేరళ ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు సైతం 19.03గా నమోదైనట్లు పేర్కొంది. అయితే ఈ ఏడాది మే 20 తర్వాత కేరళలో కోవిడ్ కేసులు 30 వేల మార్కును దాటడం ఇది రెండోసారి.

కేరళలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 38,83,429కి చేరింది. మృతుల సంఖ్య 19,972కి పెరిగినట్లు ఇవాళ విడుదల చేసిన ప్రకటనల కేరళ వైద్యారోగ్యశాఖ పేర్కొంది. మరోవైపు గత 24 గంటల్లో 20,271 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 36,92,628కు చేరుకుందని, ప్రస్తుతం రాష్ట్రంలో 1,70,292 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు పేర్కొంది.

Covid Cases In Kerala : కేరళలో కోవిడ్ విజృంభణ..24వేలకు పైగా కొత్త కేసులు