Army Helicopter Crash: కూలిన ఆర్మీ హెలికాప్టర్ .. పైలట్, కో-పైలట్కోసం కొనసాగుతున్న గాలింపు
గురువారం ఉదయం 9.15 గంటల ప్రాంతంలో హెలికాప్టర్ కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో సంబంధాలు తెగిపోయినట్లు గౌహతి పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర రావత్ ధృవీకరించారు.
Cheetah Helicopter Crash: అరుణాచల్ ప్రదేశ్లోని దిరాంగ్ జిల్లాలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. మండల హిల్స్ ప్రాంతంలో భారత ఆర్మీ చిరుత హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. హెలికాప్టర్ లో పైలట్, కో-పైలట్ ఉన్నారు. గురువారం ఉదయం 9.15 గంటల ప్రాంతంలో హెలికాప్టర్ కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో సంబంధాలు తెగిపోయినట్లు గౌహతి పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర రావత్ ధృవీకరించారు. సింగే నుండి మిసామారి వైపు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పైలట్, కో పైలట్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.
Indian Army Cheetah helicopter has crashed near Mandala hills area of Arunachal Pradesh. Search operation for the pilots has started. More details awaited: Army sources pic.twitter.com/fqD0uu767w
— ANI (@ANI) March 16, 2023
గతేడాది అక్టోబర్లో నెలలలో భారత ఆర్మీకి చెందిన హెలికాప్టర్ అరుణాచల్ ప్రదేశ్లోని అప్పర్ సియాంగ్ జిల్లా, సింగింగ్ ప్రాంతంలో కూలిన విషయం విధితమే. ఈ ఘటనలో హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న ఐదుగురు మరణించారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు ఉన్నారు. ప్రమాదానికి గురైంది ఆధునిక తేలికపాటి, హెచ్ఏఎల్ రుద్ర అనే హెలికాప్టర్. ఈ హెలికాప్టర్ ఆ రోజు ఉదయం ట్యూటింగ్ ప్రధాన కార్యాలయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది