Railway Insurance : రూపాయి కన్నా తక్కువ మొత్తంతో రూ.10 లక్షలు రైల్వే బీమా .. ఎలా అప్లై చేసుకోవాలంటే?

ఏదైనా రైలు ప్రమాదం జరిగినపుడు ప్రయాణికులు చనిపోయినా.. తీవ్రంగా గాయపడి శాశ్వతంగా అంగవికలురు అయినా.. చికిత్స కోసమైనా భారతీయ రైల్వే శాఖ రూ.10 లక్షలు బీమా సౌకర్యం కల్పిస్తోంది. ఆన్ లైనులో టిక్కెట్లు బుక్ చేసుకునేవారికి ఈ సౌకర్యం అందుబాటులో ఉంది.

Railway Insurance : రూపాయి కన్నా తక్కువ మొత్తంతో రూ.10 లక్షలు రైల్వే బీమా .. ఎలా అప్లై చేసుకోవాలంటే?

Railway Insurance

Railway Insurance : ఇండియన్ రైల్వే శాఖ రైలు ప్రయాణికుల కోసం రూ.10 లక్షల వరకూ బీమా సదుపాయం కల్పిస్తోంది. ఒడిశా ఘోర రైలు ప్రమాదం తరువాత చనిపోయిన.. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఎలా అందబోతోందని చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రైల్వే బీమా గురించి తెలుసుకోవాల్సిన అసవరం ఏర్పడింది.

Sonu Sood : వారికి ఇచ్చే నష్టపరిహారం అయిపోయిన తర్వాత? ఒడిశా ప్రమాదంపై సోనూసూద్ సంచలన ట్వీట్..

ఒడిశా ఘోర రైలు ప్రమాదం తరువాత బాధితుల పరిస్థితి ఏంటి? ఆర్థికంగా వారికి ఎలాంటి సాయం అందుతుంది? రైల్వే శాఖ నుంచి సాయం పొందాలంటే ఎలా? ఇలాంటి అంశాలు చర్చకు వస్తున్నాయి. అయితే రైల్వే శాఖ ప్రతి రైలు ప్రయాణికుడికి రూ.10 లక్షల వరకూ బీమా సాయం అందిస్తుంది. ఈ బీమా సౌకర్యం ద్వారా రైలు ప్రయాణంలో మరణించిన లేదా శాశ్వతంగా అంగవైకల్యం ఏర్పడినా.. ఏ పనీ చేయలేని పరిస్థితులు ఏర్పడినా బాధితుల కుటుంబాలకు రూ.10 లక్షలు సహాయం చేస్తారు. తీవ్ర గాయాలతో అంగ వైకల్యం ఏర్పడితే రూ.7.5 లక్షలు.. గాయపడిన వారికి చికిత్స కోసం రూ. 2 లక్షల వరకూ సాయం అందిస్తారు.

 

ఏదైనా ప్రమాదాల్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే రూపాయి కన్నా తక్కువ మొత్తం చెల్లిస్తే చాలు ఇండియన్ రైల్వేస్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా బీమా సౌకర్యాన్ని పొందవచ్చును. అయితే ఆన్ లైనులో టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి ఈ సదుపాయం అందుబాటులో ఉంది.

West Bengal Bus Accident : ఒడిశా రైలు ప్రమాద క్షతగాత్రులను తరలిస్తుండగా.. బస్సు ప్రమాదంలో మళ్లీ గాయాలు

ఇక ఈ విషయం చాలామందికి అవగాహన లేకపోవడంతో ప్రమాదాలు జరిగినపుడు ఎలాంటి సాయం పొందలేకపోతున్నారు. వెబ్ సైట్‌లో టికెట్లు బుక్ చేసుకునే సందర్భంలో ఇన్సూరెన్స్ చేసుకోవడానికి ప్రత్యేకంగా ఒక బాక్సు కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే రూపాయి కన్నా తక్కువ మొత్తం చెల్లించమని అడుగుతుంది. మీరు చెల్లించిన వెంటనే మీ ఫోను లేదా ఈ-మెయిల్‌కి ఒక లింక్ వస్తుంది. ఆ లింకులో నామిని వివరాలు ఇవ్వాలి. బీమా పొందిన వ్యక్తులు రైలు ప్రమాదంలో చనిపోతే వారిని ఇంటికి చేర్చడం కోసం రూ. 10,000 సైతం బీమా సంస్థ అందిస్తుంది. బీమా పొందాలంటే నామినీగా ఎవరైతే ఉన్నారో వారు తగిన పత్రాలతో ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదిస్తే నాలుగు నెలలలోగా బాధితులకు బీమా సొమ్ము అందుతుంది.