Indian Railways: రైలు క్యాన్సిలైందని… ప్రయాణికుడికి కార్ బుక్ చేసిన రైల్వే శాఖ

రైలు క్యాన్సిల్ కావడంతో ఒక ప్రయాణికుడికి కార్ బుక్ చేసి గమ్యస్థానానికి చేర్చింది. సత్యం గద్వి అనే ఐఐటీ మద్రాస్‌కు చెందిన ఏరోస్పేస్ ఇంజనీరింగ్ స్టూడెంట్ గుజరాత్‌లోని ఏక్తా నగర్ రైల్వే స్టేషన్ నుంచి వడోదరకు టిక్కెట్ బుక్ చేసుకున్నాడు.

Indian Railways: రైలు క్యాన్సిలైందని… ప్రయాణికుడికి కార్ బుక్ చేసిన రైల్వే శాఖ

Indian Railways

Indian Railways: వర్షాల వల్లో, మరో కారణం వల్లో రైలు క్యాన్సిల్ అయితే ప్రయాణికులకు టికెట్ రీఫండ్ మాత్రమే చేస్తుంది రైల్వేశాఖ. ప్రయాణికులు తమ గమ్యస్థానం చేరేందుకు వేరే మార్గం చూసుకోవాల్సి ఉంటుంది. అంతేకానీ, రైల్వే శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయదు. కానీ, ఇటీవల దీనికి విరుద్ధంగా వ్యవహరించింది రైల్వేశాఖ.

Nothing: ‘నథింగ్’ ఫోన్ దక్షిణాది కోసం కాదన్న సంస్థ.. మండిపడుతున్న నెటిజన్లు

రైలు క్యాన్సిల్ కావడంతో ఒక ప్రయాణికుడికి కార్ బుక్ చేసి గమ్యస్థానానికి చేర్చింది. సత్యం గద్వి అనే ఐఐటీ మద్రాస్‌కు చెందిన ఏరోస్పేస్ ఇంజనీరింగ్ స్టూడెంట్ గుజరాత్‌లోని ఏక్తా నగర్ రైల్వే స్టేషన్ నుంచి వడోదరకు టిక్కెట్ బుక్ చేసుకున్నాడు. అయితే, ఇటీవల కురిసిన వర్షాల కారణంగా చాలా రైళ్లు క్యాన్సిల్ అయ్యాయి. అందులో సత్య టికెట్ బుక్ చేసుకున్న రైలు కూడా ఉంది. అయితే, విద్యార్థి త్వరగా వెళ్లాల్సిన అవసరం ఉండటంతో రైల్వే అధికారులు స్పందించారు. రైలు క్యాన్సిల్ అయినప్పటికీ అతడి కోసం ఒక కార్ బుక్ చేశారు. కార్లో అతడిని వడోదర చేర్చారు. ఇది దాదాపు రెండు గంటల ప్రయాణం. ఇంత దూరమైనా కారు బుక్ చేయడం విశేషం. దీనిపై సత్య స్పందించాడు.

Sonia Gandhi: పార్టీ నేతలతో నేడు సోనియా భేటీ.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై చర్చ

‘‘వర్షాల వల్ల నేను వెళ్లాల్సిన రైలు చివరి నిమిషంలో క్యాన్సిల్ అయ్యింది. కానీ, ఏక్తా నగర్ రైల్వే స్టాఫ్ స్పందించారు. వాళ్లు నా కోసం ఒక కారు మాట్లాడారు. దీనివల్ల అధికారులు రైల్వే ప్రయాణికులకు ఎంతటి ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థమవుతోంది’’ అంటూ సత్య చెప్పాడు.