Indian Railways : రైల్వే శాఖ కీలక నిర్ణయం..అదనపు లగేజీకి ప్రత్యేక రుసుము

‘ఫ్రీ అలవెన్స్‌’ పరిధిని దాటి అదనపు లగేజీతో ప్రయాణించే వారు ప్రత్యేకంగా రుసుము చెల్లించాలని తెలిపింది. టికెట్‌ తీసుకోకుండా ఎక్స్‌ట్రా లగేజీతో అక్రమంగా ప్రయాణాలు చేస్తే భారీ జరిమానా విధించనున్నట్టు పేర్కొంది.

Indian Railways : రైల్వే శాఖ కీలక నిర్ణయం..అదనపు లగేజీకి ప్రత్యేక రుసుము

Indian Railway

Indian Railways : సాధారణంగా విమాన ప్రయాణికులు ఎక్స్‌ట్రా లగేజీని తీసుకువెళ్లాలంటే దానికి ప్రత్యేక రుసుము చెల్లించాలి. ఇక నుంచి రైళ్లలో ప్రయాణించే వారు కూడా అదనపు లగేజీకి ప్రత్యేక రుసుము చెల్లించాలి. భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఫ్రీ అలవెన్స్‌’ పరిధిని దాటి అదనపు లగేజీతో ప్రయాణించే వారు ప్రత్యేకంగా రుసుము చెల్లించాలని తెలిపింది. టికెట్‌ తీసుకోకుండా ఎక్స్‌ట్రా లగేజీతో అక్రమంగా ప్రయాణాలు చేస్తే భారీ జరిమానా విధించనున్నట్టు పేర్కొంది. ఈ మేరకు రైల్వేశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

టికెట్‌ లేకుండా ఎక్స్‌ట్రా లగేజీతో ప్రయాణిస్తూ పట్టుబడితే లగేజీ రుసుము కంటే ఆరు రెట్లు జరిమానా విధిస్తారు. ఉదాహరణకు 40 కిలోల ఎక్స్‌ట్రా బ్యాగ్‌తో ఒక వ్యక్తి 500 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నాడనుకుంటే..ఆ వ్యక్తి రూ.109 చెల్లించి లగేజీ టికెట్‌ తీసుకోవాలి. ఒకవేళ సదరు వ్యక్తి టికెట్‌ తీసుకోకపోతే.. రూ. 654ను జరిమానా వేస్తారు.

Indian Railways : రైల్వే శాఖ కొత్త రూల్.. ఇకపై అవి ఉంటేనే టికెట్ బుకింగ్

ఎక్స్‌ట్రా లగేజీతో ప్రయాణించే వ్యక్తి రైలు బయల్దేరడానికి కనీసం 30 నిమిషాల ముందు లగేజీ ఆఫీసులో అధికారులను సంప్రదించి ప్రత్యేక టికెట్‌ తీసుకోవాల్సివుంటుంది. ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేసుకునేవారు అప్పుడే రుసుము చెల్లించవచ్చు. ఎక్స్‌ట్రా లగేజీకి కనిష్ట రుసుము రూ.30 ఉంటుంది.