corona: దేశంలో 1,50,100కు చేరిన క‌రోనా యాక్టివ్ కేసులు

దేశంలో క‌రోనా కేసుల ఉద్ధృతి కొన‌సాగుతోంది. కొత్త‌గా 21,411 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, గ‌త 24 గంట‌ల్లో 20,726 మంది క‌రోనా నుంచి కోలుకున్న‌ట్లు పేర్కొంది. అదే స‌మ‌యంలో కరోనా వ‌ల్ల 67 మంది ప్రాణాలు కోల్పోయార‌ని వివ‌రించింది. దీంతో దేశంలో క‌రోనా వ‌ల్ల ఇప్ప‌టివ‌ర‌కు మృతి చెందిన వారి సంఖ్య 5,25,997కు చేరింది.

corona: దేశంలో 1,50,100కు చేరిన క‌రోనా యాక్టివ్ కేసులు

Corona Cases

corona: దేశంలో క‌రోనా కేసుల ఉద్ధృతి కొన‌సాగుతోంది. కొత్త‌గా 21,411 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, గ‌త 24 గంట‌ల్లో 20,726 మంది క‌రోనా నుంచి కోలుకున్న‌ట్లు పేర్కొంది. అదే స‌మ‌యంలో కరోనా వ‌ల్ల 67 మంది ప్రాణాలు కోల్పోయార‌ని వివ‌రించింది. దీంతో దేశంలో క‌రోనా వ‌ల్ల ఇప్ప‌టివ‌ర‌కు మృతి చెందిన వారి సంఖ్య 5,25,997కు చేరిందని తెలిపింది. ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,31,92,379గా ఉంద‌ని పేర్కొంది.

రిక‌వ‌రీ రేటు 98.46 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో క‌రోనాకు 1,50,100 మంది చికిత్స తీసుకుంటున్నారని పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.46 శాతంగా ఉంది. వారాంత‌పు పాజిటివిటీ రేటు 4.46 శాతంగా ఉంద‌ని చెప్పింది. గ‌త 24 గంట‌ల్లో 34,93,209 క‌రోనా వ్యాక్సిన్ డోసులు వేశామ‌ని తెలిపింది. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో వినియోగించిన క‌రోనా డోసుల సంఖ్య 201.68 కోట్ల‌కు చేరిందని వివరించింది. వాటిలో 92.90 సెకండ్ డోసులు, 6.93 కోట్ల బూస్ట‌ర్ డోసులు ఉన్నాయని చెప్పింది.

Maharashtra: శివసేన పార్టీ ఎవ‌రిది?.. ప‌త్రాలు స‌మ‌ర్పించాల‌ని ఈసీ ఆదేశం