Infinix New Smartphones : కొత్త ఫోన్ కొంటున్నారా? రూ. 20వేల లోపు ధరకే రెండు ఇన్‌ఫినిక్స్ 5G ఫోన్లు.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ఎప్పటినుంచంటే?

Infinix New Smartphones : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ ఇన్‌ఫినిక్స్ (Infinix) నుంచి రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అయ్యాయి.

Infinix New Smartphones : కొత్త ఫోన్ కొంటున్నారా? రూ. 20వేల లోపు ధరకే రెండు ఇన్‌ఫినిక్స్ 5G ఫోన్లు.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ఎప్పటినుంచంటే?

Infinix launches two new smartphones with MediaTek processor and 120Hz screen, Full Details

Infinix Two Smartphones : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ ఇన్‌ఫినిక్స్ (Infinix) నుంచి రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అయ్యాయి. మీడియాటెక్ MediaTek ప్రాసెసర్, 120Hz స్ర్కీన్ వంటి ఫీచర్లతో భారత మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. Infinix కంపెనీ లేటెస్టుగా రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేసింది.

Infinix Zero 5G 2023, Infinix Zero 5G 2023 Turbo అనే స్మార్ట్‌ఫోన్లను రూ. 20వేల కన్నా తక్కువ ధర కేటగిరీలో అందుబాటులోకి వచ్చాయి. రెండు హ్యాండ్‌సెట్‌లు MediaTek డైమెన్సిటీ చిప్‌సెట్‌లతో ఆధారితంగా పనిచేస్తున్నాయి. 5,000mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. కొత్త Infinix స్మార్ట్‌ఫోన్‌లు ఫిబ్రవరి 11 నుంచి Flipkart ద్వారా అందుబాటులో ఉంటాయి.

ఇన్‌ఫినిక్స్ Zero 5G 2023 ధర ఎంతంటే? :
ఇన్‌ఫినిక్స్ (Infinix) Zero 5G 2023 ఒకే మోడల్‌తో వచ్చింది. 8GB RAM ఫోన్ 128GB స్టోరేజీతో వస్తుంది. దీని ధర రూ. 17,999లుగా ఉంది. కోరల్ ఆరెంజ్, పెర్లీ వైట్, సబ్‌మెరైనర్ బ్లాక్ ఫోన్ కలర్ వేరియంట్‌లలో వస్తుంది. Infinix Zero 5G 2023 మోడల్ ధర రూ. 1,500 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను Infinix ప్రకటించింది.

ఇన్‌ఫినిక్స్ Zero 5G 2023 Turbo ధర ఎంతంటే? :
ఇన్‌ఫినిక్స్ జీరో 5G 2023 Turbo ఫోన్ 8GB RAM ద్వారా పనిచేస్తుంది. 256GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ధర రూ. 19,999గా ఉంది. Infinix Zero 5G 2023 మాదిరిగానే, టర్బో మోడల్ కూడా కోరల్ ఆరెంజ్, పెర్లీ వైట్, సబ్‌మెరైనర్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. Infinix Zero 5G 2023 Turbo ఫోన్ ఎక్స్ఛేంజ్ బోనస్‌లో గరిష్టంగా రూ. 2వేల తగ్గింపు ఉంటుంది.

Infinix launches two new smartphones with MediaTek processor and 120Hz screen, Full Details

Infinix New Smartphones : Infinix launches two new smartphones with MediaTek processor

Read Also : Infinix Zerobook : 12వ జెన్-ఇంటెల్ కోర్ i9 ప్రాసెసర్‌తో ఇన్‌ఫినిక్స్ జీరోబుక్ ల్యాప్‌టాప్ వచ్చేసింది.. క్రియేటర్ల కోసం స్పెషల్ ఫీచర్లు, భారత్‌లో ధర ఎంతో తెలుసా?

ఇన్‌ఫినిక్స్ స్పెసిఫికేషన్లు ఇవే :
ఇన్‌ఫినిక్స్ (Infinix) Zero 5G 2023, Infinix Zero 5G 2023 Turbo రెండూ Android 12-ఆధారిత XOS 12పై రన్ అవుతాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు 6.78-అంగుళాల Full-HD+ (1,080×2,460 పిక్సెల్‌లు)తో 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తాయి. డిస్ప్లే 360Hz టచ్ శాంప్లింగ్ రేట్, RGB కలర్ గామట్ 100 శాతం కవరేజీతో వస్తుంది.

Infinix Zero 5G 2023, MediaTek Dimensity 920 5G SoC ద్వారా పనిచేస్తుంది. అయితే Infinix Zero 5G 2023 Turbo MediaTek Dimensity 1080 5G చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు 5GB వరకు వర్చువల్ RAM సపోర్టుతో 8GB RAMని అందిస్తాయి.

కెమెరా ముందు భాగంలో, రెండు డివైజ్‌లు వెనుకవైపు 3 కెమెరా సెటప్‌ను కలిగి ఉంటాయి. 50MP ప్రధాన సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఒక్కొక్కటి రెండు 2MP సెన్సార్‌లతో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం, డ్యుయల్ ముందువైపు 16MP కెమెరాతో వస్తుంది.

Infinix Zero 5G 2023, Infinix Zero 5G 2023 టర్బోలు క్వాడ్ రియర్ ఫ్లాష్‌తో వస్తాయి. తక్కువ కాంతి పరిస్థితుల్లో ఫొటోలను క్యాప్చర్ చేసేందుకు సూపర్ నైట్ మోడ్‌ను అందిస్తాయి. ఈ హ్యాండ్‌సెట్‌లు 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Jio True 5G Services : హరిద్వార్‌లో జియో ట్రూ 5G సర్వీసులు.. కొత్తగా 226 నగరాల్లో అందుబాటులోకి..!