iOS 16.3 Update : ఆపిల్ ఐఫోన్లలో కొత్త iOS 16.3 సెక్యూరిటీ అప్‌డేట్.. ఏయే ఐఫోన్లలో సపోర్టు చేస్తుంది? ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే?

iOS 16.3 Update : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ యూజర్ల కోసం iOS 16.3 సెక్యూరిటీ అప్‌డేట్ రిలీజ్ చేసింది. ఈ కొత్త iOS అప్‌డేట్ భారత మార్కెట్లో కూడా అందుబాటులో ఉంది.

iOS 16.3 Update : ఆపిల్ ఐఫోన్లలో కొత్త iOS 16.3 సెక్యూరిటీ అప్‌డేట్.. ఏయే ఐఫోన్లలో సపోర్టు చేస్తుంది? ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే?

iOS 16.3 for iPhones now rolling out with a big focus on security _ Eligible iPhones, how to download

iOS 16.3 Update : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ యూజర్ల కోసం iOS 16.3 సెక్యూరిటీ అప్‌డేట్ రిలీజ్ చేసింది. ఈ కొత్త iOS అప్‌డేట్ భారత మార్కెట్లో కూడా అందుబాటులో ఉంది. iOS అప్‌డేట్ కొత్త ఫీచర్లతో వస్తుంది. అంతేకాదు.. ఐఫోన్లలో బగ్ సమస్యలను కూడా ఫిక్స్ చేస్తుంది. ఐఫోన్ యూజర్లందరికి iOS లేటెస్ట్ వెర్షన్‌లో కొత్తగా లాంచ్ అయిన HomePod (2వ జనరేషన్)కి సపోర్టు చేస్తుంది. 2FA (టూ-ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్) ప్రారంభించడానికి ఎక్స్ ట్రనల్ సెక్యూరిటీ కీలను అందిస్తుంది. iOS 16.3 అప్‌డేట్ అమెరికాలో బ్లాక్ హిస్టరీ మంత్ వేడుకలో నల్లజాతి చరిత్ర, సంస్కృతిని గౌరవించేలా కొత్త యూనిటీ వాల్‌పేపర్‌ను కలిగి ఉంది. Apple iPads డివైజ్‌లలోనూ iPadOS 16.3, Apple Macs మోడల్‌పై macOS Ventura 13.2, Apple Watches మోడల్స్ కోసం WatchOS 9.3ని కూడా రిలీజ్ చేస్తోంది.

ఏయే ఐఫోన్లలో iOS 16.3 సపోర్టు చేస్తుందంటే? :
గత ఏడాదిలో ప్రవేశపెట్టిన iOS 16.0 మాదిరిగానే, iOS 16.3 iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro, iPhone 14 Pro Max, iPhone 13, iPhone 13 mini, iPhone 13 Pro, iPhone 13 Pro Max, iPhone 12,లలో ఈ కొత్త iOS 16.3 అప్‌డేట్ అందుబాటులో ఉంది. iPhone 12 mini, iPhone 12 Pro, iPhone 12 Pro Max, iPhone 11, iPhone 11 Pro, iPhone 11 Pro Max, iPhone XS, iPhone XS Max, iPhone XR, iPhone X, iPhone 8, iPhone 8 Plus, iPhone SE (3వ జనరేషన్), iPhone SE (2వ జనరేషన్). Settings > General > Software Updates వెళ్లడం ద్వారా యూజర్లు మాన్యువల్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేటెస్ట్ iOS 16.3 భారతీయ యూజర్లకు కూడా అందుబాటులో ఉంది. ఈ కొత్త అప్‌డేట్ సైజు దాదాపు 800MBగా ఉంటుంది.

iOS 16.3 for iPhones now rolling out with a big focus on security _ Eligible iPhones, how to download

iOS 16.3 for iPhones now rolling out with a big focus on security

Read Also : Apple iOS 16.2 Update : ఐఫోన్ 12 సహా ఆపై మోడళ్లలో 5G సపోర్టుతో iOS 16.2 అప్‌డేట్.. మీ ఐఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!

iOS 16.3 ఫీచర్లు ఇవే :
ఐఓఎస్ (iOS 16.3) అన్‌లాక్ చేయగల అతి పెద్ద ఫీచర్ 2FA సెక్యూరిటీ ఫీచర్. ఎక్స్‌ట్రనల్ Keys ద్వారా టూ-ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్ కొత్త కాన్సెప్ట్ కాదు. ఈ సపోర్టు చాలా మంది ప్రైవసీ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. Apple ID కోసం సెక్యూరిటీ కీలు కొత్త డివైజ్‌ల్లో టూ-ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్ సైన్-ఇన్ ప్రక్రియలో భాగంగా ఫిజకిల్ సెక్యూరిటీ కీని అందించడం ద్వారా వారి అకౌంట్ సెక్యూరిటీని ప్రొటెక్ట్ చేసేందుకు యూజర్లకు అనుమతిస్తాయి. Google, Microsoft వంటి ఇతర పెద్ద టెక్ కంపెనీలతో పాటు Apple కూడా పాస్‌వర్డ్-లెస్ ఫీచర్ తీసుకురావాలని భావించాయి.

ఐఫోన్ యూజర్లు FIDO మార్గదర్శకాలతో రూపొందించిన బయోమెట్రిక్ డేటాను సెక్యూరిటీ కీలను ఉపయోగించవచ్చు. iPhone 14 Pro Max బగ్ సమస్యలను కూడా ఫిక్స్ చేస్తుంది. ఎమర్జెన్సీ SOS కాల్‌లకు ఇప్పుడు UP లేదా Down వాల్యూమ్ బటన్‌తో సైడ్ బటన్‌ను పట్టుకుని, ఆపై ‘inadvertent emergency calls’ నిరోధించడానికి రిలీజ్ చేయాలని కంపెనీ తెలిపింది. Apple Macs, iPadలు, వాచ్ కోసం కొత్త అప్ డేట్ కూడా రిలీజ్ చేసింది. కొత్త సిస్టమ్ అప్‌డేట్‌ల కోసం యూజర్లు సెట్టింగ్‌లకు వెళ్లి మార్చుకోవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp iOS Update : వాట్సాప్‌లో కొత్త అప్‌డేట్.. iOS యూజర్లు చాట్‌ మెసేజ్‌లను తేదీల వారీగా సెర్చ్ చేయొచ్చు!