iPhone 13 : ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. రూ. 12,400 తగ్గింపు.. ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా.. త్వరపడండి!

ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 13 సిరీస్‌ (iPhone 13 Series)పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ 13 ఇమాజిన్ ఆపిల్ ప్రీమియం రీసెల్లర్ స్టోర్‌లలో డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది.

iPhone 13 : ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. రూ. 12,400 తగ్గింపు.. ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా.. త్వరపడండి!

Iphone 13 Gets Rs 12,400 Discount, Exchange Offers May Reduce Price To Rs 48,500

iPhone 13 : ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 13 సిరీస్‌ (iPhone 13 Series)పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ 13 ఇమాజిన్ ఆపిల్ ప్రీమియం రీసెల్లర్ స్టోర్‌లలో డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. అధికారిక రీటైలర్ ప్రస్తుతం iPhone 13 ఫోన్.. 128GB స్టోరేజ్ బేస్ మోడల్‌పై రూ. 8,400 ఇన్ స్టంట్ డిస్కౌంట్‌ అందిస్తోంది. అదేవిధంగా రూ. 4,000 విలువైన HDFC బ్యాంక్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. రూ. 79,999 MRPతో వచ్చే iPhone 13 (128GB) రూ. 71,500కు సొంతం చేసుకోవచ్చు. అలాగే కొనుగోలుదారులు తమ HDFC క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే.. ఐఫోన్ 13 సిరీస్ ధర రూ.67,500కి తగ్గుతుంది.

ఈ ఫోన్‌ను రూ. 48,500 కన్నా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చని స్టోర్ పేర్కొంది. పాత ఐఫోన్‌లపై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లను కూడా అందిస్తోంది. కానీ, పాత ఫోన్‌ల విలువ మారుతూ ఉంటుంది. రూ. 19వేల విలువైన ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. ఇంత తక్కువ ధరకు iPhone 13ని పొందాలంటే.. iPhone 12 Pro లేదా Pro Maxలో మాత్రమే లభించే అవకాశం ఉంటుంది. ఇమాజిన్ Apple ప్రీమియం ప్రకారం.. ఈ సేల్ ఆఫర్ ఆఫ్‌లైన్ స్టోర్‌లతో పాటు ఆన్‌లైన్ స్టోర్‌లో అందుబాటులో ఉంటుంది. అన్ లిమిటెడ్ పరిమితికి మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రతినిధి తెలిపారు.

Iphone 13 Gets Rs 12,400 Discount, Exchange Offers May Reduce Price To Rs 48,500 (1)

Iphone 13 Gets Rs 12,400 Discount, Exchange Offers May Reduce Price To Rs 48,500 

ఆఫ్‌లైన్ స్టోర్‌ల నుంచి iPhone 13ని పొందాలని ప్లాన్ చేస్తుంటే.. మీ నగరంలోని ఏదైనా ఇమాజిన్ స్టోర్‌కి వెళ్లవచ్చు (మహారాష్ట్ర మినహా). మీ లొకేషన్‌లో సమీపంలోని ఆఫ్‌లైన్ రిటైలర్‌ను చెక్ చేసేందుకు Myimaginestore వెబ్‌సైట్‌కి వెళ్లండి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లపై అధికారిక ఆపిల్ రిటైలర్‌ల నుంచి ఐఫోన్‌లను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్‌లకు ఈ సేల్ బెస్ట్ ఆఫర్ అందిస్తోంది. బ్లూ, గ్రీన్, రెడ్, వైట్ మిడ్ నైట్, పింక్ కలర్ ఆప్షన్లలో మధ్య ఎంచుకోవచ్చు. Amazon iPhone 13 (128GB)ని రూ.69,990కి పొందవచ్చు. Flipkart ఫోన్ అదే స్టోరేజ్ వేరియంట్‌ను రూ.74,209కి విక్రయిస్తోంది.

Read Also : iPhone 14 Series : భారత్‌లో ఐఫోన్ 13 ధరతో పోలిస్తే.. ఐఫోన్ 14 ధర రూ.10వేలపైనే ఉండొచ్చు..!