iPhone 14 Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. సూపర్ డీల్.. డోంట్ మిస్.. ఇప్పుడే కొనేసుకోండి..!

iPhone 14 Sale : మీరు ఐఫోన్ 14 కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో అదిరిపోయే డీల్‌ను అందిస్తోంది. ఐఫోన్ 14పై బ్యాంక్ ఆఫర్‌లతో పాటు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లను అందిస్తోంది.

iPhone 14 Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. సూపర్ డీల్.. డోంట్ మిస్.. ఇప్పుడే కొనేసుకోండి..!

iPhone 14 can be bought at Rs 55,900 on Flipkart_ Here is how the deal works

iPhone 14 Sale : మీరు ఐఫోన్ 14 కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో అదిరిపోయే డీల్‌ను అందిస్తోంది. ఐఫోన్ 14పై బ్యాంక్ ఆఫర్‌లతో పాటు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లను అందిస్తోంది. రెండు డీల్స్ కలిపి ధరను దాదాపు రూ. 20వేల వరకు తగ్గించవచ్చు. ఐఫోన్ 14 ఫ్లిప్‌కార్ట్‌లో 128GB స్టోరేజీపై ధర రూ.79,900గా లిస్టు చేసింది. మీ వద్ద HDFC బ్యాంక్ కార్డ్, పాత ఐఫోన్ ఉంటే.. ఐఫోన్ 14 రూ.79,900 చెల్లించాల్సిన అవసరం లేదు.

ధర ఎంతంటే? :
ఐఫోన్ 14 అసలు ధర రూ.79,900గా ఉంది. HDFC బ్యాంక్ కార్డ్‌తో మీ డివైజ్‌ను రూ. 5వేల డిస్కౌంట్‌తో పొందవచ్చు. ఎందుకంటే HDFC iPhone 14 కొనుగోలుపై రూ. 5వేల క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. మీరు ధరను మరింత తగ్గించాలనుకుంటే.. మీరు మీ పాత iPhone ద్వారా తక్కువ ధరకే పొందవచ్చు.

మీరు iPhone 11పై ఎక్స్ఛేంజ్ వాల్యూగా రూ. 15వేల వరకు పొందవచ్చు. iPhone 12 ఉంటే.. మీరు రూ. 19వేల వరకు పొందవచ్చు. దాంతో ఐఫోన్ 14 ధర రూ.55,900కి తగ్గింది. మీరు మీ పాత ఫోన్‌ను సేల్ ద్వారా కొనుగోలు చేయడం ద్వారా డివైజ్ మంచి కండీషన్‌లో ఉందని నిర్ధారించుకోవాలి.

iPhone 14 : స్పెసిఫికేషన్‌లు :
ఆపిల్ ఐఫోన్ 14 డివైజ్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED ప్యానెల్‌తో సన్నని బెజెల్స్‌ ద్వారా పనిచేస్తుంది. డిస్‌ప్లే HDRకి సపోర్టు అందిస్తుంది. 1200-నిట్స్ బ్రైట్‌నెస్, ఫేస్ ID సెన్సార్‌లతో వస్తుంది. 60Hz ప్రామాణిక రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఐఫోన్ 14లో A15 బయోనిక్ చిప్ కూడా ఉంది. 16-కోర్ NPU, 5-కోర్ గ్రాఫిక్స్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది.

iPhone 14 can be bought at Rs 55,900 on Flipkart_ Here is how the deal works

iPhone 14 can be bought at Rs 55,900 on Flipkart

ప్రాసెసర్ గరిష్టంగా 4GB RAM, మూడు స్టోరేజీ ఆప్షన్లతో పనిచేస్తుంది. 128GB, 256GB, 512GB. ఐఫోన్ 14 లేటెస్ట్ స్థిరమైన iOS 16 వెర్షన్‌తో రన్ అవుతుంది. కనెక్టివిటీ కోసం.. స్మార్ట్‌ఫోన్ 5G, Wi-Fi, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, GPS, ఛార్జింగ్ కోసం లైట్నింగ్ పోర్ట్‌కు సపోర్టుతో వస్తుంది.

కెమెరా విషయానికొస్తే.. iPhone 14 డ్యూయల్ రియర్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో బిగ్ f/1.5 ఎపర్చరు, సెన్సార్-షిఫ్ట్ OIS, సెకండరీ 12MP అల్ట్రా-వైడ్ యాంగిల్ షూటర్‌తో ప్రైమరీ 12MP వైడ్ యాంగిల్ సెన్సార్ ఉన్నాయి. అంతేకాదు.. వీడియో రికార్డింగ్ కోసం.. డాల్బీ విజన్‌కు సపోర్టు అందిస్తుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : India iPhone Users : భారత్‌లో ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. మీ ఫోన్‌లో 5Gని ఎలా యాక్టివేట్ చేయాలో తెలుసా?