IPL 2021 KKR Vs SRH కోల్‌కతా ముందు స్వల్ప లక్ష్యం

ఐపీఎల్ 2021 రెండో దశలో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. మరోసారి హైదరాబాద్ బ్యాట్స్ మెన్ ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరిచారు. ఒక్కరు కూడా రాణించలేదు.

IPL 2021 KKR Vs SRH కోల్‌కతా ముందు స్వల్ప లక్ష్యం

Sunrisers Hyderabad

IPL 2021 KKR Vs SRH : ఐపీఎల్ 2021 సెకండాఫ్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. మరోసారి హైదరాబాద్ బ్యాట్స్ మెన్ ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరిచారు. ఒక్కరు కూడా రాణించలేదు. పంజాబ్ బౌలర్ల దెబ్బకు హైదరాబాద్ బ్యాట్స్ మెన్ విలవిలలాడారు. ఈ మ్యాచ్ లో టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 115 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (21 బంతుల్లో 26) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అబ్దుల్‌ సమద్‌ (25), ప్రియమ్‌ గార్గ్‌ (21) పర్వాలేదనిపించారు.

హైదరాబార్ జట్టుకి ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. టిమ్‌ సౌథీ వేసిన రెండో బంతికే వృద్ధిమాన్ సాహా ఎల్బీగా వెనుదిరిగాడు. జేసన్ రాయ్‌ (10), అభిషేక్‌ శర్మ (6), రషీద్‌ ఖాన్ (8) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. జేసన్‌ హోల్డర్ (2) నిరాశ పరిచాడు. కోల్‌కతా బౌలర్లలో టిమ్‌ సౌథీ, వరుణ్‌ చక్రవర్తి, శివమ్‌ మావి తలో రెండు వికెట్లు, షకీబ్‌ అల్ హసన్‌ ఒక వికెట్‌ తీశారు.

Google ban: జాగ్రత్త! మీ ఫోన్‌లో ఈ 136 డేంజరస్ యాప్‌లు ఉంటే, బ్యాంకు అకౌంట్‌లో డబ్బులు పోవచ్చు

ఇప్పటికే, ప్లే ఆఫ్ రేస్ లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ముందుండగా.. మరో రెండు స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. హైదరాబాద్ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి వైదొలిగింది. మరోవైపు KKRకి ఇప్పుడు ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై లాంటిదే. 10 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న కోల్ కతా.. తాడో పేడో తేల్చుకోని.. ప్లే ఆఫ్ రేస్ లో స్ట్రాంగ్ గా నిలవాలని చూస్తోంది.

కోల్ కతా బ్యాటింగ్ లైనప్ లో ఓపెనర్లు కీలకంగా మారారు. శుభమన్ గిల్, వెంకటేశ్ అయ్యర్ లు మంచి ఆరంభాల్ని అందిస్తున్నారు. రాహుల్ త్రిపాఠి కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. అయితే, కెప్టెన్ మోర్గాన్ ఫామ్ కోల్ కతాని కలవరపెడుతోంది. అతని బ్యాట్ నుంచి ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ రాలేదు. నితీశ్ రానా, దినేశ్ కార్తీక్ ఫర్వాలేదనిపిస్తున్నారు. బౌలింగ్ లో సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తమ మిస్టరీ బౌలింగ్ తో ఆకట్టుకుంటున్నారు. టిమ్ సౌథీ, లుకీ ఫెర్గ్యూసన్ పేస్ బౌలింగ్ భారాన్ని మోస్తున్నారు. గత మ్యాచ్ లో ఫెర్గ్యూసన్ గాయంతో మ్యాచ్ ఆడలేదు. ఈ మ్యాచ్ కీలకం కావడంతో.. తమ సర్వశక్తులు ఒడ్డేందుకు రెడీ అయింది.

Amazon Festival Sale : స్మార్ట్ ఫోన్లు, టీవీలపై భారీ డిస్కౌంట్లు.. ప్రైమ్ యూజర్లకు బెనిఫిట్స్!

సన్ రైజర్స్ పరిస్థితి దయనీయంగా ఉంది. చెన్నైతో జరిగిన మ్యాచ్ లో తేలిపోయిన హైదరాబాద్ బ్యాటర్లు.. కోల్ కతా తో పోరులోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది.