IPL: మరో 10 లీగ్ మ్యాచులే మిగిలాయి.. ఫైనల్ రేసులో ఉన్న జట్లు ఏవి? ఆరెంజ్ క్యాప్ సంగతేంటీ?

మార్చి 31 నుంచి ప్రారంభమైన 16వ ఐపీఎల్ మే 28న ముగియనుంది.

IPL: మరో 10 లీగ్ మ్యాచులే మిగిలాయి.. ఫైనల్ రేసులో ఉన్న జట్లు ఏవి? ఆరెంజ్ క్యాప్ సంగతేంటీ?

Ipl 2023

IPL-2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023లో మరో 10 లీగ్ మ్యాచులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ తర్వాత ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచు జరగనున్నాయి. మే 21న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్(GT) మధ్య చివరి లీగ్ మ్యాచు జరగనుంది. మే 23న‌ క్వాలిఫ‌య‌ర్‌-1 మ్యాచ్, మే 24న‌ ఎలిమినేట‌ర్ మ్యాచ్‌ జరుగుతాయి.

ఆ రెండు మ్యాచులూ చెన్నైలోని ఎం.ఏ చిదంబ‌రం స్టేడియంలో జ‌రుగుతాయి. అహ్మ‌దాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మే 26న‌ క్వాలిఫ‌య‌ర్‌-2 మ్యాచ్ జరుగుతుంది. మే 28న అదే స్టేడియంలో ఫైనల్ మ్యాచ్‌ ఉంటుంది. మార్చి 31 నుంచి ప్రారంభమైన 16వ ఐపీఎల్ మే 28న ముగియనుంది.

ఫైనల్ రేసులో నిలవడానికి చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి.

అగ్రస్థానంలో గుజరాత్ 

ఇప్పటివరకు జరిగిన మ్యాచుల ఫలితాల ఆధారంగా చూస్తే పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ అగ్రస్థానంలో ఉంది. ఆ జట్టు 12 మ్యాచులు ఆడి 8 మ్యాచుల్లో గెలిచింది. దీంతో 16 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉన్నాయి. రెండో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది.

ఆ జట్టు ఖాతాలో 15 పాయింట్లు ఉన్నాయి. మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ ఉన్నాయి. ఆ జట్లకు వరుసగా 15, 14, 13, 12 పాయింట్లు ఉన్నాయి. ఈ జట్లు ప్లేఆఫ్స్ రేసులో నిలిచే అవకాశాలు ఉన్నాయి.

ఆరెంజ్ క్యాప్ రేసులో

అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసే బ్యాటర్ కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ రేసులో ఆర్సీబీ బ్యాటర్ డు ప్లెసిస్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు ఇప్పటివరకు 12 మ్యాచులు ఆడి 611 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ 13 మ్యాచులు ఆడి 575 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు.

పర్పుల్‌ క్యాప్‌ రేసులో  

అత్యధిక వికెట్లు తీసిన వారికి ఇచ్చే పర్పుల్‌ క్యాప్‌ రేసులో గుజరాత్ టైటాన్స్ బౌలర్ రషీద్ ఖాన్ (12 మ్యాచుల్లో 23 వికెట్లు) అగ్రస్థానంలో ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ చాహల్ (13 మ్యాచుల్లో 21 వికెట్లు) రెండో స్థానంలో ఉన్నాడు.

IPL Worst Records: టాప్-10 చెత్త రికార్డులు.. మరీ ఇంత తక్కువ పరుగులా?