IPL Worst Records: టాప్-10 చెత్త రికార్డులు.. మరీ ఇంత తక్కువ పరుగులా?

టాప్-10 చెత్త రికార్డుల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేరే 5 సార్లు ఉంది. 2008 నుంచి ఇప్పటివరకు కూడా ఆ జట్టులో స్టార్ బ్యాటర్ కోహ్లీ ఉన్నాడు.

IPL Worst Records: టాప్-10 చెత్త రికార్డులు.. మరీ ఇంత తక్కువ పరుగులా?

INDIAN PREMIER LEAGUE

Updated On : April 7, 2023 / 9:42 PM IST

IPL Worst Records: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో 2008 నుంచి ఇప్పటివరకు వందలాది మ్యాచులు జరిగాయి. ప్రస్తుత (IPL 2023)లో మొత్తం 70 లీగ్ మ్యాచులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన మ్యాచులతో కలిపి కొన్ని జట్లు అత్యంత తక్కువ స్కోరు చేసి చెత్త రికార్డులు మూటగట్టుకున్నాయి. అత్యంత తక్కువ స్కోరు చేసి చేసిన టాప్-10 జట్ల గురించి తెలుసుకుందాం.

అతి తక్కువ స్కోరు చేసిన చెత్త రికార్డు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేరిట ఉంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో 2017 ఏప్రిల్ 23న జరిగిన మ్యాచులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కేవలం 46 పరుగులు మాత్రమే చేసింది. అంతకు ముందు అతి తక్కువ స్కోరు చేసిన జట్టుగా రాజస్థాన్ రాయల్స్ జట్టు (2009 ఏప్రిల్ 18న 58 పరుగులు) ఉండేది. టాప్-10 చెత్త రికార్డుల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) పేరే 5 సార్లు ఉంది. 2008 నుంచి ఇప్పటివరకు కూడా ఆ జట్టులో స్టార్ బ్యాటర్ కోహ్లీ ఉన్నాడు.

టాప్-10 చెత్త రికార్డులు

1. కోల్‌కతా నైట్‌రైడర్స్ తో 2017, ఏప్రిల్ 23న జరిగిన మ్యాచులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 46 పరుగులు

2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో 2009లో జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ 58 పరుగులు

3. ముంబైతో 2017లో జరిగిన మ్యాచులో ఢిల్లీ డేర్‌డెవిల్స్ 66 పరుగులు

4. పంజాబ్ కింగ్స్ తో 2017లో జరిగిన మ్యాచులో ఢిల్లీ డేర్‌డెవిల్స్ 67 పరుగులు

5. ముంబైతో 2008లో జరిగిన మ్యాచులో కోల్‌కతా నైట్‌రైడర్స్ 67 పరుగులు

6. సన్‌రైజర్స్ తో 2022 జరిగిన మ్యాచులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 68 పరుగులు

7. చెన్నై సూపర్ కింగ్స్ తో 2019లో జరిగిన మ్యాచులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 70

8. రాజస్థాన్ రాయల్స్ తో 2014లో జరిగిన మ్యాచులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 70 పరుగులు

9. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తో 2017లో జరిగిన మ్యాచులో పంజాబ్ కింగ్స్ 73 పరుగులు

10. డక్కన్ చార్జర్స్ తో 2011లో జరిగిన మ్యాచులో కొచ్చి 74 పరుగులు

IPL Bowling records: ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-10 బౌలర్లు వీరే..