IPL: నేడే ఐపీఎల్ ప్రసార హక్కుల ఇ-వేలం

వేలంలో ప్రధానంగా రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, సోనీ గ్రూప్, జీ నెట్‌వర్క్ పోటీ పడుతున్నాయి. వేలంలో తప్పనిసరిగా పాల్గొంటుందని భావించిన అమెజాన్ మాత్రం పోటీ నుంచి తప్పుకొంది. ఐపీఎల్ ఐదు సీజన్లకు సంబంధించి, ప్రతి సీజన్‌లో 74 మ్యాచులకు కలిపి వేలం నిర్వహిస్తారు.

IPL: నేడే ఐపీఎల్ ప్రసార హక్కుల ఇ-వేలం

Ipl

IPL: ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం నేడు ఇ-వేలం జరగనుంది. 2023-2027 వరకు ఐపీఎల్ మ్యాచుల శాటిలైట్ (టీవీ) ప్రసారాలు, డిజిటల్ (ఓటీటీ) ప్రసార హక్కుల కోసం వేల జరగుతుంది. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇ-వేలం నిర్వహించడం ఇదే మొదటిసారి. ఆదివారం ఉదయం పదకొండు గంటలకు వేలం ప్రారంభమవుతుంది.

Jubilee Hills Rape Case: నేడూ కొనసాగనున్న నిందితుల విచారణ

వేలంలో ప్రధానంగా రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, సోనీ గ్రూప్, జీ నెట్‌వర్క్ పోటీ పడుతున్నాయి. వేలంలో తప్పనిసరిగా పాల్గొంటుందని భావించిన అమెజాన్ మాత్రం పోటీ నుంచి తప్పుకొంది. ఐపీఎల్ ఐదు సీజన్లకు సంబంధించి, ప్రతి సీజన్‌లో 74 మ్యాచులకు కలిపి వేలం నిర్వహిస్తారు. చివరి రెండేళ్లు మ్యాచుల సంఖ్యను పెంచేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రసార హక్కులకు సంబంధించి ఎ, బి, సి, డి అనే నాలుగు ప్యాకేజీలు ఉన్నాయి. ఎ.. ఇండియాలో టెలివిజన్ హక్కుల కోసం కాగా, బి ఇండియాలో డిజిటల్ ప్రసార హక్కుల కోసం. డి.. ఇండియా కాకుండా ప్రపంచవ్యాప్తంగా టెలివిజన్, డిజిటల్ హక్కులకు సంబంధించింది. సీ.. నాన్ ఎక్స్‌క్లూజివ్ మ్యాచులకు సంబంధించింది. ప్యాకేజి ఎ లో ఒక మ్యాచుకు రూ.49 కోట్లు, ప్యాకేజి బి లో ఒక మ్యాచుకు రూ.33 కోట్లు, ప్యాకేజి సిలో ఒక మ్యాచుకు రూ.11 కోట్లు, ప్యాకేజి డిలో ఒక మ్యాచుకు రూ.3 కోట్లుగా ధర నిర్ణయించారు.

Janasena Pawan : జనసేనాని దారెటు? వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో జనసేన పొత్తు?

ఐపీఎల్ వల్ల బీసీసీఐకి భారీగా ఆదాయం వస్తోంది. ఐపీఎల్‌కు సంబంధించి 2017-2022 వరకు స్టార్ నెట్‌వర్క హక్కులు దక్కించుకుంది. అంతకుముందుతో పోలిస్తే ఈ సమయంలో వేలం ద్వారా రెట్టింపు ఆదాయం వచ్చింది. ఇప్పుడు మూడు రెట్ల ఆదాయం వస్తుందని బీసీసీఐ భావిస్తోంది. వేలం ఆదివారం రోజే పూర్తైనప్పటికీ విజేతల వివరాలను ఇప్పట్లో ప్రకటించే అవకాశం లేదు.