IPL2022 MI Vs RR : సెంచరీ బాదిన బట్లర్… ముంబై టార్గెట్ 194

తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.(IPL2022 MI Vs RR)

IPL2022 MI Vs RR : సెంచరీ బాదిన బట్లర్… ముంబై టార్గెట్ 194

Ipl2022 Mi Vs Rr

IPL2022 MI Vs RR : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా నేడు రాజస్తాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ముంబై ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ముంబైకి 194 పరుగుల భారీ టార్గెట్ నిర్దేశించింది.

రాజస్తాన్ బ్యాటర్లలో ఓపెనర్ జోస్ బట్లర్ సెంచరీతో కదంతొక్కాడు. 68 బంతుల్లోనే శతకం బాదాడు. బట్లర్ స్కోర్ లో 5 సిక్సులు, 11 ఫోర్లు ఉన్నాయి. సెంచరీ చేసిన వెంటనే బట్లర్ (100) ఔట్ అయ్యాడు. షిమ్రోన్‌ హెట్‌మైర్‌ (14 బంతుల్లో 35 పరుగులు), కెప్టెన్ సంజూ శాంసన్ (21 బంతుల్లో 30 పరుగులు) రాణించారు. హెట్‌మైర్ (3×4, 3×6) క్రీజులో ఉన్నంత సేపు బౌండరీలతో అలరించాడు. సంజూ శాంసన్‌ (30) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. యశస్వీ జైస్వాల్‌ (1), దేవ్‌దత్‌ పడిక్కల్‌ (7), నవదీప్‌ సైని (2) విఫలమయ్యారు. రవిచంద్రన్‌ అశ్విన్‌ (0) డకౌటయ్యాడు. రియాన్ పరాగ్‌ (5) ఆఖరు బంతికి క్యాచ్‌ ఔటయ్యాడు. ముంబై బౌలర్లలో బుమ్రా, టైమల్ మిల్స్ తలో 3 వికెట్లు పడగొట్టారు. కీరన్ పొలార్డ్ ఒక వికెట్ తీశాడు. ఆఖరి రెండు ఓవర్లలో రాజస్తాన్ 5 వికెట్లు కోల్పోయింది.(IPL2022 MI Vs RR)

IPL 2022: డివిలియర్స్ రికార్డుకు సమం చేసిన ఎంఎస్ ధోనీ

గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమైన స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్ యాదవ్ ను ఈ మ్యాచులో కూడా అందుబాటులో లేడు. ఫస్ట్ మ్యాచ్ ఆడిన సేమ్ టీమ్ తోనే బరిలోకి దిగింది ముంబై ఇండియన్స్. ఇక, రాజస్తాన్ రాయల్స్ జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగింది. గాయపడ్డ నాథన్ కౌల్టర్ నైల్ స్థానంలో యంగ్ పేసర్ నవదీప్ షైనీకి తుది జట్టులో చోటు కల్పించింది. తన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఢిల్లీ కేపిటల్స్ చేతిలో చిత్తుగా ఓడింది.

ప్రస్తుతం పాయింట్ల పరంగా రోహిత్ సేన స్థానం 9. కింది నుంచి రెండో స్థానంలో ఉంది. దీంతో, ఈ మ్యాచ్‌లో గ్రాండ్ విక్టరీ కొట్టి.. తన స్థానాన్ని మెరుగుపర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు రాజస్తాన్‌ రాయల్స్‌.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై 61 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించి.. ఈ సీజన్ ను ఘనంగా ప్రారంభించింది. ఇదే దూకుడు ఈ మ్యాచ్ లో కూడా కంటిన్యూ చేయాలని భావిస్తోంది.

హెడ్‌ టు హెడ్‌ రికార్డులను పరిశీలిస్తే.. ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ జట్ల మధ్య మొత్తం 25 మ్యాచులు జరగ్గా 13 మ్యాచుల్లో ముంబై ఇండియన్స్ గెలిచింది. 11 మ్యాచుల్లో రాజస్తాన్ గెలుపొందింది. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

IPL 2022: “ఒక్క ఇన్నింగ్స్‌తో బదోనీ సూపర్ స్టార్ అయిపోడు”

ముంబై: రోహిత్ శర్మ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్ (వికెట్ కీపర్‌), అన్మోల్‌ ప్రీత్‌ సింగ్‌, తిలక్ వర్మ, కీరన్‌ పొలార్డ్, టిమ్‌ డేవిడ్, డేనియల్‌ సామ్స్, మురుగన్‌ అశ్విన్‌, జస్ప్రీత్‌ బుమ్రా, టైమల్‌ మిల్స్, బాసిల్‌ థంపి

రాజస్తాన్‌: జోస్ బట్లర్, యశస్వీ జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్‌), దేవదత్ పడిక్కల్, షిమ్రోన్‌ హెట్‌మయర్‌, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్‌, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్‌, నవ్‌దీప్‌ సైని, ప్రసిద్ధ్ధ్‌ కృష్ణ