Irom Sharmila On Manipur Video : మణిపూర్ ఘటన నన్ను కలవరపరిచింది.. అమానవీయ ఘటన.. స్పందించిన ఇరోమ్ షర్మిల..

మణిపూర్ ఘటనపై మానవ హక్కుల కార్యకర్త ఇరోమ్ షర్మిల స్పందించారు. ఈ ఘటన తనను చాలా కలవరపరిచిందని పేర్కొన్నారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Irom Sharmila On Manipur Video : మణిపూర్ ఘటన నన్ను కలవరపరిచింది.. అమానవీయ ఘటన.. స్పందించిన ఇరోమ్ షర్మిల..

Irom Sharmila On Manipur Video

Irom Sharmila On Manipur Video : మణిపూర్ ఘటనపై ఇరోమ్ షర్మిల స్పందించారు. ఈ ఘటన తనను కలవరపరిచిందని నిందితులకు పెరోల్ లేకుండా యావజ్జీవిత కారాగార శిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేశారు.

Manipur Women Viral Video : నాటి షాకింగ్ ఘటన గురించి బాధిత మణిపూర్ మహిళ ఏం చెప్పారంటే…

మణిపూర్‌లో ఆర్మీ దుశ్చర్యలకు నిరసనగా 16 ఏళ్లుగా ఆహారం తీసుకోని మానవ హక్కుల కార్యకర్త ఇరోమ్ షర్మిల మణిపూర్‌లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటనపై స్పందించారు. ఈ దారుణ ఘటనపై నిందితులకు పెరోల్ లేకుండా యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని అన్నారు. ఈ ఘటన తనను చాలా కలవరపరిచిందని సరైన సమయంలో కేంద్రం జోక్యం చేసుకుని ఉంటే ఇది జరిగేది కాదని ఆమె పేర్కొన్నారు. దీనిని అత్యంత అమానవీయ ఘటనగా ఆమె మాట్లాడారు.

Celebrities Reaction : భయానకం.. అత్యంత దారుణం.. మణిపూర్ అమానవీయ ఘటనపై సెలబ్రిటీల ట్వీట్లు

మణిపూర్‌లో కొందరు పురుషులు రోడ్డుపై ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన భయంకరమైన వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో  పార్లమెంటు ఉభయ సభల్లో గందరగోళానికి దారితీశాయి. పదే పదే వాయిదా పడ్డాయి. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. నేరం మరియు వీడియోపై జనం నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తడంతో పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకున్నారు.