టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తున్నాయా? క్యాడర్‌లో కన్‌ఫ్యూజన్‌!

టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తున్నాయా? క్యాడర్‌లో కన్‌ఫ్యూజన్‌!

పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వచ్చినట్లుగా చెబుతోన్న జనసేన.. మున్సిపోల్స్‌లో సత్తా చాటుతాం అనే నమ్మకంతో ఉంది. ఈ క్రమంలోనే జనసేన నేతలు బలంగా ప్రచారం చేస్తోంది. అయితే ఇప్పుడు ఆ పార్టీ క్యాడర్‌కు మరో కన్‌ప్యూజన్ వచ్చింది. ఇది పాత ప్రచారమే అయానా.. జన సైనికులను కాస్త ఎక్కువగా కంగారు పెడుతోంది.. జనసేన పార్టీ టీడీపీతో కలుస్తుంది… అన్న ప్రచారం ఇటీవల జోరుగా సాగుతోంది.

మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో చాలా చోట్ల జనసేన, టీడీపీ మద్దతుదారులు పరస్పర అంగీకారంతో కలిసి పోటీ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అక్కడక్కడా జనసేనకు టీడీపీ మద్దతు ఇస్తోంది కూడా. దీంతో ఈ రెండు పార్టీలు మళ్ళీ కలుస్తున్నాయా? అనే ప్రచారం జోరుగా సాగుతోంది. అగ్నికి ఆజ్యం పోసినట్టు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చేసిన వ్యాఖ్యలు మరింత కన్‌ఫ్యూజన్‌లోకి నెట్టాయి జనసైనికులను.. జనసేన, టీడీపీ, వామపక్షాలు కలిసి పనిచేయాలనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేయగా.. క్యాడర్‌ వరకే పరిమితమైన టాక్‌ కాస్తా.. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌కు పాకిపోయింది.

మరోవైపు టీడీపీతో జనసేన కలుస్తుంది అనే ప్రచారాన్ని జనసేన నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. జనసేనకు ప్రజాదరణ వస్తుండడంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. జనసేన బీజేపీతో పొత్తులో ఉందని.. ఆ రెండు పార్టీలే కలిసి పని చేస్తాయని అంటున్నారు. అంతే తప్పా మరే ఇతర పార్టీలతో కలిసి అవకాశం లేదని చెప్తున్నారు. కొందరు నేతలైతే టీడీపీ కంటే ముందే జనసేన ఉంటుంది కానీ కలిసే ప్రసక్తే లేదంటున్నారు.