Varun Gandhi: బీజేపీకి టాటా.. తొందరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్న వరుణ్ గాంధీ?

ఒకప్పుడు విధ్వేష ప్రసంగాలకు మారుపేరుగా ఉన్న ఆయన ఇప్పుడే వాటిపైనే పెద్ద ఎత్తున యుద్ధం చేస్తుండడం గమనార్హం. బీజేపీని వదిలేయనున్నట్లు ఎప్పుడో సంకేతాలు ఇచ్చిన వరుణ్ గాంధీకి తమ పార్టీలో చేరితే కీలక స్థానాన్ని ఇస్తామని ఎన్‌సీపీ, సమాజ్‌వాదీ పార్టీ, టీఎంసీ వంటి పార్టీలు ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.

Varun Gandhi: బీజేపీకి టాటా.. తొందరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్న వరుణ్ గాంధీ?

Is Varun Gandhi preparing to quit BJP and join Congress?

Varun Gandhi: గాంధీ కుటుంబమే అయినప్పటికీ.. అప్పట్లో ఏర్పడ్డ కుటుంబ గొడవల కారణంగా ఇన్నాళ్లూ భారతీయ జనతా పార్టీలో ఉంటూ వచ్చిన వరుణ్ గాంధీ.. కొంత కాలంగా పార్టీకి వ్యతిరేకంగా గొంతు వినిపిస్తున్న విషయం తెలిసిందే. మోదీ రెండవ కేబినెట్‭లో తల్లి మేనకా గాంధీకి చోటు దక్కకపోవడంపై పెరిగిన అసంతృప్తి, క్రమక్రమంగా పార్టీ వీడేంత వరకూ వచ్చిందని అంటున్నారు. అయితే ఇంత వరకు బాగానే ఉంది కానీ, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Bharat Jodo Yatra: ముగింపు దశలో భారత్ జోడో యాత్ర.. రెండవ విడత ప్రియాంకతో కొనసాగించే ప్లాన్‭లో కాంగ్రెస్

ఉత్తర ప్రదేశ్‌లోని తన నియోజకవర్గమైన ఫిలిబిత్‌లో గత నెలలో జరిగిన బహిరంగ సభలో వరుణ్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తన్నాయి. ‘‘నేను నెహ్రూ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకం కాదు. రాజకీయాలు ప్రజలను ఏకం చేయాలని, అంతర్యుద్ధాన్ని రెచ్చగొట్టకూడది. నేడు మతం, కులం ఆధారంగా ఓట్లు అడుగుతున్నవారిని ఓ ప్రశ్న అడగాలి. నిరుద్యోగం, విద్య, ఆరోగ్యం వంటి తీవ్రమైన సమస్యల పరిష్కారం కోసం ఏం చేస్తున్నారని ప్రశ్నించాలి. ప్రజలను అణచివేయడాన్ని నమ్ముకున్న రాజకీయాలు చేయకూడదు. ప్రజలను ఉద్ధరించే విధంగా రాజకీయాలు చేయాలి’’ అని వరుణ్ గాంధీ అన్నారు.

Congress-2023: కాంగ్రెస్ పార్టీకి మెడపై కత్తిలా 2023.. ఏమాత్రం పట్టు తప్పినా పార్టీ గోతిలో పడ్డట్టే

తాను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాదని, అలాగే నెహ్రూ కుటుంబానికి కూడా వ్యతిరేకం కాదని వరుణ్ గాంధీ చెప్పడం గమనార్హం. పాత కోపాల్ని, కుటుంబ గొడవల్ని వదిలి ఇప్పుడు అదే నెహ్రూ కుటుంబం ఏకమవబోతోందనే వాదనకు ఇది బలాన్ని చేకూర్చేదే. విచిత్రం ఏంటంటే.. ఒకప్పుడు విధ్వేష ప్రసంగాలకు మారుపేరుగా ఉన్న ఆయన ఇప్పుడే వాటిపైనే పెద్ద ఎత్తున యుద్ధం చేస్తుండడం గమనార్హం. బీజేపీని వదిలేయనున్నట్లు ఎప్పుడో సంకేతాలు ఇచ్చిన వరుణ్ గాంధీకి తమ పార్టీలో చేరితే కీలక స్థానాన్ని ఇస్తామని ఎన్‌సీపీ, సమాజ్‌వాదీ పార్టీ, టీఎంసీ వంటి పార్టీలు ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.

Assembly, Lok Sabha polls: లోక్‌సభ, 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం విస్తారక్‌లను పంపుతున్న బీజేపీ

అయితే జాతీయ స్థాయి నాయకుడిగా నిలవాలంటే ఆయనకు కాంగ్రెస్ తప్ప మరొక పార్టీ కనిపించడం లేదని విశ్లేషకులు చెప్తున్నారు. బీజేపీలో తన భవిష్యత్తుకు తాళం పడినట్లేనని స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, పార్టీ మారడానికి ఇంకా ఎందుకు ఆసల్యం చేస్తున్నారో అర్థం కావడం లేదని అంటున్నారు. బహుశా పార్టీయే తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారేమోనని కూడా కొందరు అంటున్నారు. అయితే కాంగ్రెస్‌లో చేరాలనుకుంటే, ఆ పార్టీలో తన స్థానమేంటో ముందుగానే తెలుసుకోవాలని సలహా ఇస్తున్నారు. ప్రియాంక గాంధీ వాద్రాతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయని, అయితే సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నిర్ణయంపైనే అంతా ఆధారపడుతుందని, ముందుగా వాటిపై క్లారిటీ వచ్చాకే పార్టీ మారాలని ఆయన సన్నిహితులు చెబుతున్నారట.