IT Raids in Hyderabad: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి నివాసంలో రెండోరోజు ఐటీ సోదాలు
రామచంద్రపురానికి సమపీంలో ఉండే తెల్లాపూర్ లో రాజ పుస్ఫ లైఫ్ స్టైల్ కాలనీలో నివసిస్తున్న మాజీ ఐఏఎస్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. ఇవాళ కూడా ఆయన ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రాజపుష్ప, వసుధ, ముప్ప, వర్టెక్స్ సంస్థలపై ఐటీ శాఖ దాడులు జరుగుతున్నాయి.

IT Raids in Hyderabad: ఆదాయ పన్ను శాఖ అధికారులు హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వరుసగా రెండోరోజు సోదాలు నిర్వహిస్తున్నారు. నిన్న వసుధ ఫార్మా సంస్థకు చెందిన కార్యాలయాలు, అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం మూడు సంస్థలు, ఓ ఔషధ సంస్థ కార్యాలయాల్లో సోదాలు జరిగాయి.
రామచంద్రపురానికి సమపీంలో ఉండే తెల్లాపూర్ లో రాజ పుస్ఫ లైఫ్ స్టైల్ కాలనీలో నివసిస్తున్న మాజీ ఐఏఎస్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. ఇవాళ కూడా ఆయన ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రాజపుష్ప, వసుధ, ముప్ప, వర్టెక్స్ సంస్థలపై ఐటీ శాఖ దాడులు జరుగుతున్నాయి.
ఆయా సంస్థల కార్యాలయాలు, మేనేజింగ్ డైరెక్టర్లు, పీఏల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అధికారులు కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, రాజ పుష్ప సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరిగా వెంకట్రామి రెడ్డి ఉన్నారు. ఆయన కొన్నాళ్ల క్రితమే రాజకీయల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఆయన కుమారుడి వివాహం ఇటీవల జరిగింది. అయితే, అందుకయిన ఖర్చు పై కూడా ఐటీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. దీనిపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.