water hyacinth sarees : గుర్రపు డెక్క పూలతో చీరల తయారీ..యువ ఇంజనీర్ ఐడియా..

వరైనా చీరలమీద పువ్వుల డిజైన్లు వేస్తారు. కానీ యువ ఇంజనీర్ గౌరవ్ మాత్రం పూలతోనే చీరలు తాయారు చేయవచ్చని ఇవి త్వరలోనే అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు యువ ఇంజనీర్.

10TV Telugu News

Sarees Making with Water Hyacinth : అందరిలా ఆలోచిస్తే గుంపులో గోవిందాలా ఉంటాం. వినూత్నంగా ఆలోచిస్తే ఎంతమందిలో ఉన్నా గుర్తింపు తెచ్చుకుంటాం. అదే వినూత్నే కాకుండా పర్యావరణహితంగా ఆలోచిస్తే ఇదిగో ఈ యు ఇంజినీర్ లా ఆలోచింపజేస్తాం. పర్యావరణ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ గౌరవ్ ఆనంద్ ఆలోచన బహుశా ఎవ్వరికి వచ్చి ఉండదు. ఎవరైనా చీరలమీద పువ్వుల డిజైన్లు వేస్తారు. కానీ గౌరవ్ మాత్రం పూలతోనే చీరల్ని తయారుచేయవచ్చనని చెబుతున్నారు.  ‘‘వాటర్ హయసింత్’’ నుంచి సేకరించిన ఫైబర్‌తో చీరలను తయారు చేసే విధానాన్ని కనుగొన్నారు పర్యావరణ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ గౌరవ్ ఆనంద్.

చీరల తయారీకి వాటర్ హైసింత్ ను వాడటం ఇదే తొలిసారికావటం విశేషం. జనపనార మాదిరిగానే వాటర్ హయసింత్‌ను ఉపయోగించి, సేకరించిన ఫైబర్‌ను ప్రాసెస్ చేసి..దాన్ని దారాలుగా మార్చి, చీరలను తయారు చేయవచ్చునంటున్నారు గౌరవ్.కాగా వాటర్ హైసింత్  (Water Hyacinth) ఉష్ణమండలానికి చెందిన నీటి మొక్క. ఇవి ఎక్కువగా చెరువులు,కాలువల్లో పెరుగుతుంటుంది. దాన్నే గ్రామాల్లోనే కాకుండా నగరాల్లో కూడా ‘గుర్రపు డెక్క’ అని వాడుక భాషలో అంటుంటాం. ఇటువంటి నీటి మొక్కల జాతులు చాలానే ఉంటాయనే విషయం తెలిసిందే. నీటిలో నాచులాగా ఇవి పెరుగుతుంటాయి. ఈ వాటర్ హైసింత్ ఐకోర్నియా అని కూడా అంటారు.

Read more : Quran app banned in china : చైనాలో ముస్లింలకు ఖురాన్ యాప్ తొలగించిన యాపిల్..

గౌరవ్ ఆనంద్ జంషెడ్‌పూర్‌లోని టాటా స్టీల్ యుటిలిటీస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్‌లో పని చేస్తున్నారు. వాటర్ హైసింత్ ఫైబర్ ఉంటుంది. అంటే పీచు. జనపనార, గోగు నార లాగా. ఈ ఫైబర్‌ను సేకరించడం చాలా సులువని..దానిని దారంగా తయారు చేసి చీరలు తయారు చేయటం చాలా తేలిక అని తెలిపారు. మహిళలు కూడా ఈ పనిని తేలికగా చేయవచ్చు అని అన్నారు. మహిళలకు ఇది చక్కటి ఉపాధిగా చేసుకోవచ్చని గౌరవ్ సూచించారు. నదుల్లోగానీ, కాలువల్లో గాని ఉండే ఈ వాటర్ హౌసింత్ ను సేకరించి, దానిని ఎండబెట్టి, పలుచని ఫైబర్‌ను తీసి, ఏజెన్సీకి అమ్ముకోవచ్చునని తెలిపారు. ఆ ఏజెన్సీవారు ఆ ఫైబర్‌ను దారాల (నూలు) రూపంలోకి మార్చుతారని చెప్పారు.

ఈ దారాలను స్థానిక చేతి వృత్తులవారికి ఇస్తే, వారు అత్యుత్తమ నాణ్యతగల చీరలను తయారు చేస్తారని చెప్పారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా, నదలు, కాలువలు కూడా శుభ్రపడుతుందన్నారు. దీనికి సంబంధించిన ప్రయోగాలన్నీ జరుగుతున్నాయని, వివిధ ఏజెన్సీలతో చర్చలు తుది దశలో ఉన్నాయని చెప్పారు. సుమారు ఐదు నుంచి ఏడు నెలల్లోగా హయసింత్ చీరలు మార్కెట్లోకి వస్తాయని తెలిపారు.

Read more : I Don’t want To beg : నేను బిచ్చమెత్తుకోవట్లేదు..రూ.10 పెట్టి పెన్ను కొనండి చాలు: ఇట్లు బోసినవ్వుల బామ్మ

పశ్చిమ బెంగాల్‌కు చెందిన ‘నేచర్ క్రాఫ్ట్’ అనే సంస్థ ఈ వాటర్ హౌసింత్ ఫైబర్‌లను కొనుగోలు చేసి వాటిని చక్కటి దారాలుగా మార్చడానికి అంగీకరించిందని ఆనంద్ తెలిపారు. “బండ్‌గావ్, హౌరాలో మేము ఏర్పాటు చేయనున్న ప్రాసెసింగ్ ప్లాంట్ల ద్వారా నిర్దిష్ట నిష్పత్తిలో నీటి పట్టీ ఫైబర్‌లతో పత్తి లేదా పాలిస్టర్ కలపడం ద్వారా చక్కటి ట్రెడ్‌లు తయారు చేయబడతాయి” అని కౌశిక్ మండల్ ఆఫ్ నేచర్ క్రాఫ్ట్ తెలిపారు.