Jana Reddy: మరోసారి అవకాశం ఇస్తే, చేయని పనులు పూర్తిచేసి స్వర్గానికి వెళ్తాను: జానారెడ్డి

ప్రజలు ఎన్నికల్లో తనకు మరొకసారి అవకాశం ఇస్తే, చేయని పనులు పూర్తి చేసి స్వర్గానికి వెళ్తానని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా నిడమనూర్ మండలం తుమ్మడం గ్రామంలో హాథ్ సే హాథ్ జోడో యాత్రలో పాల్గొన్న జానారెడ్డి అనంతరం మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలు నన్ను ఏడు సార్లు గెలిపించారని తెలిపారు. తాను మూడు సార్లు ఓడినా, అది ప్రజల వల్ల కాదని అన్నారు.

Jana Reddy: మరోసారి అవకాశం ఇస్తే, చేయని పనులు పూర్తిచేసి స్వర్గానికి వెళ్తాను: జానారెడ్డి

jana-reddy

Updated On : March 16, 2023 / 12:39 PM IST

Jana Reddy: ప్రజలు ఎన్నికల్లో తనకు మరొకసారి అవకాశం ఇస్తే, చేయని పనులు పూర్తి చేసి స్వర్గానికి వెళ్తానని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా నిడమనూర్ మండలం తుమ్మడం గ్రామంలో హాథ్ సే హాథ్ జోడో యాత్రలో పాల్గొన్న జానారెడ్డి అనంతరం మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలు నన్ను ఏడు సార్లు గెలిపించారని తెలిపారు. తాను మూడు సార్లు ఓడినా, అది ప్రజల వల్ల కాదని అన్నారు.

ప్రభుత్వం పోలీస్ ఫోర్స్ తో, డబ్బుతో గెలిచిందని తెలిపారు. కానీ, ప్రజల హృదయంలో తాను ఉన్నానని జానారెడ్డి చెప్పారు. అటు మోదీ, ఇటు కేసీఆర్ చేస్తున్న అరాచకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకే హాథ్ సే హాథ్ జోడో యాత్ర చేపట్టామని తెలిపారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారా 30 వేల ఎకరాలకు నీరందించానని చెప్పారు. 2014 నాటికి సాగర్ నియోజకవర్గ మొత్తం బీటీ రోడ్డు వేయించిన ఘనత తనదేనని తెలిపారు. 250 గ్రామాలకు కరెంట్ ఇచ్చిన ఘనత తన సొంతమని ఆయన చెప్పారు.

స్వయం సహాయక సంఘాల వడ్డీ 5వేల కోట్ల రూపాయలు తన వద్ద ఉంచుకున్న నాయకుడు కేసీఆర్ అని విమర్శించారు. లక్ష రూపాయలు రుణమాఫీ చేయకుండా 5 సంవత్సరాలకు డబుల్ వడ్డీ వేసిన ఘనత కేసీఆర్ దేనని అన్నారు. శ్రీశైలం నుండి వచ్చే సొరంగమార్గం కాలువ ను పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వం ఎందుకని నిలదీశారు. మన దెబ్బకు నెల్లికల్ లిఫ్ట్ స్టార్ట్ చేశారని అన్నారు. మోదీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని చెప్పారు.

MLA KotamReddy : ప్రజా సమస్యల గురించి మాట్లాడేందుకు నాకు 5నిమషాలు టైమివ్వలేదు..నన్ను తిట్టటానికి మంత్రులకు 40నిముషాలు టైమిచ్చారు : కోటంరెడ్డి