MLA KotamReddy : ప్రజా సమస్యల గురించి మాట్లాడేందుకు నాకు 5నిమిషాలు టైమివ్వలేదు..నన్ను తిట్టటానికి మంత్రులకు 40నిమిషాలు టైమిచ్చారు : కోటంరెడ్డి

ప్రజా సమస్యల గురించి మాట్లాడేందుకు నాకు 5నిమిషాలు టైమివ్వలేదు..కానీ నన్ను తిట్టటానికి ఐదుగురు మంత్రులకు 40నిమిషాలు టైమిచ్చారు అంటూ వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి వాపోయారు.

MLA KotamReddy : ప్రజా సమస్యల గురించి మాట్లాడేందుకు నాకు 5నిమిషాలు టైమివ్వలేదు..నన్ను తిట్టటానికి మంత్రులకు 40నిమిషాలు టైమిచ్చారు : కోటంరెడ్డి

MLA KotamReddy

MLA KotamReddy : నెల్లూరు రూరల్ వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు స్పీకర్. తన నియోజకవర్గం సమస్యల గురించి మాట్లాడటానికి తనకు మైక్ ఇవ్వాలని డిమాండ్ చేశారు కోటంరెడ్డి. అయినా స్పీకర్ మైక్ ఇవ్వకపోవటంతో కోటంరెడ్డి స్పీకర్ పోడియం ముందు నిలబడి నియోజకవర్గ సమస్యలపై స్పీకర్‌కు కోటంరెడ్డి విజ్జప్తి చేశారు..మైక్ ఇవ్వాలని కోరారు.. ఈ క్రమంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని సెషన్ మెత్తానికి సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని నిర్ణయం తీసుకున్నారు.

Kotamreddy Sridhar Reddy : అసెంబ్లీలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసన

ఈక్రమంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయంలో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఈసందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ.. నా నియోగక వర్గం సమస్యల గురించి..ప్రజా సమస్యల గురుంచి మాట్లాడేందుకు నాకు కనీసం ఐదు నిమిషాలు కూడా సమయం ఇవ్వలేదని..కానీ నన్ను తిట్టేట్టానికి ఐదుగురు మంత్రులకు స్పీకర్ 40 నిమిషాలు సమయం ఇచ్చారు అంటూ వాపోయారు. తనను సస్పెండ్ చేయటాన్ని నిరసిస్తూ కోటంరెడ్డి ఈరోజు ప్లకార్డుతో పాదయాత్రగా అసెంబ్లీకి వచ్చారు. నిన్న అసెంబ్లీలో నాలుగు గంటలు నిలబడి..స్పీకర్ పోడియం వద్దకి వెళ్లిన కోటంరెడ్డి తనకు మైక్ ఇవ్వాలని కోరారు. దీంతో అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు కోటంరెడ్డిని సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని . స్పీకర్ చైర్ ఏర్పాటు చేసి స్పీకర్ గా షంషుద్దీన్ ని కూర్చోపెట్టిన ఎమ్మెల్యే కోటంరెడ్డి ..అసెంబ్లీలో తాను ఏమి చెప్పదలుచుకున్నానో ఆ అంశాల్ని మాక్ స్పీకర్ ముందు చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని వివిధ సమస్యలని వివరించారు.

Phones Tapping In YCP : ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తా..బెదిరింపులకు భయపడేది లేదు : వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి

ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ..నేను ప్రశాంతంగా గాంధీగిరిలో నిరసన చేస్తే… సస్పెండ్ చేసి మార్షల్ చేత బయటకి పంపించారని..నేనేం చేశానని నన్ను అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారో ఆలోచించండి
? అంటూ కోరారు.రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గ సమస్యని పరిష్కరించమని అడిగానని..వంతెనల నిర్మాణం కోసం ఈనెల 30 లోపు టెండర్లు పిలవకుంటే వచ్చే నెల 6 వ తేదీన పొట్టేపాలెం కలుజు వద్ద ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నీళ్ళల్లో కూర్చుని జలదీక్ష చేస్తానని స్పష్టంచేశారు కోటంరెడ్డి.  నన్ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినా..వైసీపీ నాయకులు నన్ను బెదిరించినా..నా నియోజకవర్గం ప్రజాసమస్యల కోసం ఖచ్చితంగా ప్రశ్నిస్తా… మాట తప్పును, మడమ తిప్పను అని కోటంరెడ్డి స్పష్టంచేశారు.

MLA Kotamreddy : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కాగా కోటంరెడ్డి తన ఫోన్ ను ట్యాప్ చేశారని వైసీపీపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మీడియా ముందు దానికి సంబంధించి ఆధారాలు చూపిస్తూ..పార్టీ కోసం ఇంత కష్టపడి పనిచేసిన నా ఫోన్ ట్యాప్ చేశారంటూ పలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీంతో కోటంరెడ్డిపై వైసీపీ నేతలు దండెత్తారు. ప్రెస్ మీట్లు పెట్టి మీరు కోటంరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ మారటానికే కోటంరెడ్డి ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని ఒకరంటే..మరికొంతమంది వైసీపీ నేతలు ఫోన్ ట్యాప్ చేస్తే తప్పేంటీ అంటూ ప్రశ్నించారు. ఇలా ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం వైసీపీలో పెద్ద దుమారం రేపింది. దీంతో కోటంరెడ్డిపై వైసీపీ గుర్రుగా ఉంది.