Jayasudha : సహజనటి జయసుధకి కరోనా.. అమెరికాలోనే చికిత్స..

జయసుధ కొన్ని నెలలుగా ఇండియాలో లేరు. ప్రస్తుతం ఆమె అమెరికాలోనే ఉంటున్నారు. కరోనా మొదలైన దగ్గర్నుంచి ఆమె కొత్త సినిమాలు కూడా ఏమి ఒప్పుకోవట్లేదు. ఇప్పట్లో సినిమాలు కూడా చేయాలనుకోవడం..

Jayasudha :  సహజనటి జయసుధకి కరోనా.. అమెరికాలోనే చికిత్స..

Jayasudha

Updated On : February 8, 2022 / 9:11 AM IST

Jayasudha :   ఇటీవల చాలా మంది సెలబ్రిటీలకు కరోనా సోకుతుంది. కరోనా థర్డ్ వేవ్ సెలబ్రిటీలని వదలట్లేదు. అన్ని సినీ పరిశ్రమలలో పలువురు ప్రముఖులు ఈ సారి కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే కొంతమంది కోలుకోగా, మరి కొంతమంది ఐసోలేషన్ లో ఉన్నారు. తాజాగా టాలీవుడ్ సహజనటి జయసుధ కరోనా బారిన పడ్డారు.

జయసుధ కొన్ని నెలలుగా ఇండియాలో లేరు. ప్రస్తుతం ఆమె అమెరికాలోనే ఉంటున్నారు. కరోనా మొదలైన దగ్గర్నుంచి ఆమె కొత్త సినిమాలు కూడా ఏమి ఒప్పుకోవట్లేదు. ఇప్పట్లో సినిమాలు కూడా చేయాలనుకోవడం లేదు జయసుధ. మరి కెరీర్ కి బ్రేక్ ఇచ్చిందా లేక మొత్తానికే ఆపేసిందా అనేది తెలీదు.

Aditi Shankar : స్టార్ డైరెక్టర్ కూతురు వరుణ్ తేజ్ సినిమాతో సింగర్‌గా ఎంట్రీ

ప్రస్తుతం అమెరికాలో చిన్న కొడుకు దగ్గర ఉన్న జయసుధకు తాజాగా కరోనా సోకింది. దీంతో అక్కడే అమెరికాలోనే ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. జయసుధ ఇద్దరు కొడుకులు కూడా హీరోగా చేసిన సంగతి తెలిసిందే. పెద్ద కొడుకు ఇటీవలే ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ అనే సినిమా చేశాడు