Radhika Kumaraswamy : కర్ణాటకలో JDS ఘోర పరాభవం.. అదే రోజు కుమారస్వామి భార్య రాధిక హీరోయిన్‌గా కొత్త సినిమా ఓపెనింగ్

కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కుమారస్వామి JDS పార్టీ ఘోరంగా ఓడిపోయిన రోజే కుమారస్వామి భార్య రాధికా కుమారస్వామి హీరోయిన్ గా కొత్త సినిమా ప్రారంభమైంది.

Radhika Kumaraswamy : కర్ణాటకలో JDS ఘోర పరాభవం.. అదే రోజు కుమారస్వామి భార్య రాధిక హీరోయిన్‌గా కొత్త సినిమా ఓపెనింగ్

JDS Kumaraswamy wife Radhika New Movie opening on Karnataka Results day

JDS Kumaraswamy : దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన కర్ణాటక(Karnataka) ఎన్నికల ఫలితాలను నిన్న వచ్చేశాయి. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ కాంగ్రెస్(Congress) భారీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఎవరికీ మెజార్టీ రాదు, JDS కుమారస్వామి హంగ్ తో మళ్ళీ చక్రం తిప్పుతాడని చాలా మంది భావించారు. కుమార స్వామి కూడా హంగ్ వస్తుంది, చక్రం తిప్పాలని భావించారు. కానీ కుమారస్వామి ఆశలు కూడా గల్లంతయ్యాయి. గత ఎన్నికల్లో 37 సీట్లు గెలిచి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన JDS ఈ సారి కేవలం 19 సీట్లు గెలిచి ఘోర పరాభవం చూసింది.

ఇలా కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కుమారస్వామి JDS పార్టీ ఘోరంగా ఓడిపోయిన రోజే కుమారస్వామి భార్య రాధికా కుమారస్వామి హీరోయిన్ గా కొత్త సినిమా ప్రారంభమైంది. కుమారస్వామికి రాధిక రెండో భార్య. కన్నడలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేసింది రాధిక. కుమారస్వామిని రెండో పెళ్లి చేసుకుంది. కుమారస్వామితో పెళ్లి తర్వాత కూడా అడపాదడపా సినిమాల్లో నటిస్తూనే వస్తుంది.

తాజాగా రాధిక హీరోయిన్ గా కొత్త సినిమా ఓపెన్ అయింది. బాలీవుడ్ నటుడు, పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కి హిందీలో డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ శ్రేయాస్ తల్పడే హీరోగా, రాధిక కుమారస్వామి హీరోయిన్ గా ‘అజాగ్రత్త’ అనే కొత్త సినిమా నిన్న రామానాయుడు స్టూడియోలో ఓపెనింగ్ పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ సినిమాను ఏడు భాషల్లో తెరకెక్కిస్తున్నారు.

Niharika Konidela : పుష్ప 2లో నిహారిక ఉందా? రామ్ చరణ్ పై ఆ రూమర్ నిజమేనా?.. క్లారిటీ ఇచ్చిన నిహారిక..

ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమంలో JDS పార్టీ అధినేత కుమారస్వామి భార్య, నటి రాధిక కుమారస్వామి మాట్లాడుతూ.. ఈ సినిమాకు నేను నిర్మాతగా ఉండాల్సింది. కానీ నేను హీరోయిన్‌గా ఫిక్స్ అవుతాను అని అనుకోలేదు. ఎవరూ సెట్ అవ్వడం లేదని దర్శకుడు కంగారు పడుతూ ఉంటె నేనే నా డేట్స్ కావాలా? అని అడిగాను. కథ చెప్పమని అడిగి, స్క్రిప్ట్ విన్నాక షాక్ అయ్యాను. చాలా ఏళ్ల తరువాత ఇలా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతకు, డైరెక్టర్ శశికి థాంక్స్. శ్రేయాస్ ఇది వరకు నటించిన సినిమాలు చూశాను. ఆయన ఎంతో బాగా నవ్విస్తారు. ఈ సినిమాతో పని చేయడం ఆనందంగా ఉంది అని తెలిపారు. అయితే ఇలా భర్త ఘోరంగా ఓడిపోయిన రోజే భార్య హీరోయిన్ గా సినిమా ఓపెనింగ్ జరగడంతో కర్ణాటకలో ఈ వార్త వైరల్ గా మారింది.