Niharika Konidela : పుష్ప 2లో నిహారిక ఉందా? రామ్ చరణ్ పై ఆ రూమర్ నిజమేనా?.. క్లారిటీ ఇచ్చిన నిహారిక..

డెడ్ పిక్సెల్స్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా చాలా రోజుల తర్వాత నిహారిక మీడియా ముందుకు రావడంతో మీడియా అనేక ప్రశ్నలు అడిగింది.

Niharika Konidela : పుష్ప 2లో నిహారిక ఉందా? రామ్ చరణ్ పై ఆ రూమర్ నిజమేనా?.. క్లారిటీ ఇచ్చిన నిహారిక..

Niharika Konidela gives clarity on some rumors

Updated On : May 14, 2023 / 7:15 AM IST

Ram Charan : మెగా డాటర్ నిహారిక కొణిదల(Niharika KOnidela) ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. గత కొన్నాళ్లుగా ఆమె వైవాహిక జీవితంపై అనేక రూమర్స్ వస్తున్నా ఆమె కానీ, మెగా ఫ్యామిలీ కానీ ఎవరూ స్పందించట్లేదు. గతంలో పలు సిరీస్ లు, సినిమాలు, షోలు చేసిన నిహారిక ఆ తర్వాత యాక్టింగ్ కి గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు నిహారిక తిరిగి యాక్టింగ్ లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుంది.

నిహారిక ముఖ్య పాత్రలో తెరకెక్కిన సిరీస్ డెడ్ పిక్సెల్స్. ఆన్లైన్ గేమ్స్(Online Games) యూత్ ని వాటికి ఎలా బానిసలుగా మార్చేస్తున్నాయి, వాటి వల్ల లైఫ్ లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి అనే అంశాలపై ఈ సిరీస్ ని తెరకెక్కించారు. ఇటీవల రిలీజయిన టీజర్స్, ట్రైలర్స్ చూశాక ఆన్లైన్ గేమ్స్ ఆడే యూత్ కి ఈ సిరీస్ బాగా కనెక్ట్ అవుతుంది అని భావిస్తున్నారు. డెడ్ పిక్సెల్స్ సిరీస్ హాట్ స్టార్ ఓటీటీలో మే 19 నుండి స్ట్రీమింగ్ అవ్వనుంది.

డెడ్ పిక్సెల్స్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా చాలా రోజుల తర్వాత నిహారిక మీడియా ముందుకు రావడంతో మీడియా అనేక ప్రశ్నలు అడిగింది. కొన్ని రోజుల క్రితం నిహారిక పుష్ప 2లో నటిస్తుందని వార్తలు వచ్చాయి. దీనిపై నిహారిక స్పందిస్తూ.. ఇదంతా మీడియానే సృష్టించింది. నన్నైతే ఆ సినిమా నుంచి ఎవరూ సంప్రదించలేదు. అది చాలా మంచి సినిమా అని తెలిపింది. దీంతో పుష్ప 2లో అయితే నిహారిక లేదని క్లారిటీ వచ్చేసింది.

Santosh Sobhan : అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగాము అని కష్టాల్లా చెప్తారు.. అవి కష్టాలేం కావు..

ఇక గత కొన్ని రోజులుగా రామ్ చరణ్ IPLలో ఓ టీం కొంటున్నాడని వార్తలు వస్తున్నాయి. దీనిపై నిహారికను ప్రశ్నించగా.. అవునా, నాకైతే తెలీదు. ఏ టీం కొంటున్నారు, హైదరాబాద్ టీంను కొంటున్నారా? నాకైతే చరణ్ అన్న చెప్పలేదు. ఇంటర్వ్యూ అయ్యాక వెళ్లి చరణ్ అన్నయ్యను అడుగుతాను. నా వరకు అయితే ఈ వార్త రాలేదు అని సెటైరికల్ గా సమాధానమిచ్చింది నిహారిక.